మరో ఆప్షన్ లేదు… జైలుకే శశికళ… సిఎం ఆశలు ఆవిరి..!

Sasikala--Jailఅనుకున్నట్టుగానే జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న శశికళ దోషేనని సుప్రీంకోర్టు ప్రకటించి, వారికి శిక్ష విధించాల్సిందేనని అభిప్రాయపడింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ తీర్పును చదువుతూ, ఈ కేసు తీవ్రమైనదని, చట్టాన్ని మీరి ప్రవర్తించినట్టు స్పష్టమవుతోందని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా దోషులేనని తన తుది తీర్పులో పేర్కొన్నారు. మరో న్యాయమూర్తి అమితవ రాయ్ కూడా ఇదే రకమైన తీర్పును వెల్లడించడంతో ఇక శశికళ ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు గల్లంతేనని తేలిపోయింది.

ADVERTISEMENT

శశికళతో పాటు మిగిలిన నిందితులందరూ ట్రయల్ కోర్టు విధించిన నాలుగేళ్ల శిక్ష, 100 కోట్ల జరిమానాను చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ తన తీర్పులో పేర్కొన్నారు. కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న జయలలిత మరణించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, మిగతా శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు దోషులని, వీరంతా లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువిస్తున్నామని తెలిపారు. నాలుగు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించారు.

తాజా పరిణామాలతో ఎమ్మెల్యేలు చేజారకుండా చూడాలని శశికళ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు శశికళ అన్న కుమారుడైన దీపక్ ను ముందు నిలిపి, ఫిరాయించాలని భావించే ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని శశికళ యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే ఉప్పందుకున్న పన్నీర్ వర్గం, దీపక్ ను శశి వర్గం తీసుకువస్తే, అందుకు ధీటుగా దీపను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీప నుంచి పన్నీర్ కు సానుకూల సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జయలలిత రక్త సంబంధీకులను తీసుకువచ్చి పబ్బం గడుపుకోవాలని ఇరు పక్షాలూ ఎత్తుల మీద పైఎత్తులు వేస్తున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories