
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై గత ఐదేళ్లుగా అలుపెరుగని యుద్ధం చేస్తున్న దిండి టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణ రాజు జగన్ అక్రమాస్తుల కేసు, జగన్ బెయిలు రద్దు నిమిత్తం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు.
దశాబ్దకాలం నుండి బెయిలు మీద ఉన్న వైస్ జగన్ బెయిలు రద్దు చేయాలనీ, అలాగే ఆయన మీద ఉన్న కేసుల విచారణను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ గతంలో RRR సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. అయితే ఆ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం RRR అభ్యర్ధనను తోసిపుచ్చింది.
ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర RRR కోరినట్టుగా జగన్ బెయిలు రద్దు చేయాలన్న పిటిషన్ విచారం చెప్పట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడంతో, హై కోర్ట్ ను ఆశ్రయించి పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు రఘు రామ తరపు న్యాయవాది కోర్ట్ కి విజ్ఞప్తి చేయగా అందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది.
అలాగే జగన్ అక్రమాస్తుల కేసులను తెలంగాణ హైకోర్టు కూడా పర్యవేక్షిస్తున్నందున ఈ కేసులను కూడా మరో రాష్ట్రానికి బదిలీ చేయవలసిన ఆవశ్యకత లేదంటూ తన తీర్పు వెల్లడించింది సుప్రీం కోర్ట్. దీనితో ఎలా అయినా జగన్ బెయిలు రద్దు చేసి అతనిని తిరిగి జైలుకు పంపాలని అని ఆత్రుత పడిన RRR ఆశకు న్యాయస్థానం బ్రేకులు వేసినట్లయ్యింది.
Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?
ఇప్పటికే తనను అన్యాయంగా అరెస్టు చేసి కస్టోడియడల్ టార్చెర్ చూపించిన వైస్ జగన్, అతని అనుచరగణం అంతు చూడడానికి న్యాయస్థానాలలో తన సర్వ శక్తులు ఒడ్డుతున్న RRR కి ధర్మస్థానం ఇచ్చిన తీర్పు ఊహించని షాక్ ఇచ్చినట్టే చెప్పాలి. జగన్ అధికారంలో ఉండగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో తన సొంత నియోజకవర్గమైన నర్సాపురంలో కనీసం అడుగు కూడా పెట్టనీయకుండా చేసిన జగన్ పై పై చేయి సాధించాలని పట్టుదలతో ఉన్న RRR ప్రస్తుతానికి తన పట్టు కోల్పోయినట్టేనా.?
అనూహ్యంగా జగన్ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా తన కేసుల విచారణను మాత్రం అడుగు కూడా ముందుకు పడకుండా ఆపుకోగలుగుతున్నారు. ఇది ఆయన తెర వెనుక చేస్తున్న రాజకీయం ప్రభావమో లేక జగన్ ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాల తప్పిదాలతో కానీ జగన్ కు మాత్రం బెయిలు రద్దు కావడం లేదు, కేసులు ముందుకెళ్లడం లేదు.