కేంద్రం నుండి ఏపీకి అనుకోకుండా ఒక మంచి వార్త

Suresh Prabhu gets additional charge of civil aviation ministryమోడీ ప్రభుత్వంలో టీడీపీకి ఇచ్చిన రెండు శాఖలలో అశోక్ గజపతిరాజుకి ఇచ్చిన విమానయాన శాఖ ఎంతో కొంత మెరుగైనది. అది కూడా ఇప్పుడు వదులుకోవాల్సి రావడంతో కొంతవరకు నిరుత్సాహమైన విషయమే. అయితే అనుకోకుండా ఒక మంచి వార్త వచ్చింది. కేంద్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి సురేశ్‌ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతల్ని అప్పగించింది.

ADVERTISEMENT

అశోక్‌ గజపతిరాజు రాజీనామా నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని సురేశ్‌ ‌ప్రభుకు అప్పగించాలని ప్రధాని నిర్ణయించారు. పీఎంవో సూచన మేరకు రాష్ట్రపతి కార్యాలయం శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. సురేశ్‌ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. చంద్రబాబు అంటే ఆయనకు అభిమానం.

ఇటీవలే జరిగిన పెట్టుబడుల సదస్సుకు కేంద్రమంత్రులు అంతా మొహం చాటేసినా ఆయన మాత్రం వచ్చి చంద్రబాబుని పొగిడి వెళ్లారు. కాబట్టి ఆయనకు విమానయాన శాఖ ఇవ్వడంతో కొంతమేర లాభమే మనకు. అయినా ఆయన రాష్ట్రానికి సాయం చేదాం అన్నా దానికి మోడీ అమిత్ షా అనుమతి ఉండాలి కదా.

ADVERTISEMENT
Latest Stories