ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఘన విజయం తరువాత అప్రతిహతంగా విజయ దుంధుబి కొనసాగిస్తున్నారు. దాదాపుగా కాంగ్రెస్ కు నామరూపాలు లేకుండా చేస్తున్నారు ఒక్కో రాష్ట్రాన్ని జయిస్తూ. అయితే కర్ణాటక రూపంలో వారికి పెద్ద ఛాలెంజ్ ఎదురయినట్టుగా కనిపిస్తుంది. సర్వేల ప్రకారం కర్ణాటక రాజకీయం ఇప్పటికీ కాంగ్రెస్ కే అనుకూలంగా ఉంది.
అదే గనుక జరిగితే వచ్చే ఎన్నికలలో దక్షిణాదిన కమలం పార్టీకి ఇబ్బంది కలగొచ్చు. దీనితో మోడీ సేన ఒక అడుగు వెనుకకు వేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం కర్నాటక లో ఎన్నికలను ఆరు నెలల పాటు వాయిదా వేయించవచ్చని తెలుస్తుంది. ఆ విధంగా ఎన్నికలకు సిద్ధం కావడానికి వారికి మరింత సమయం దక్కుతుంది కూడా.
వచ్చే నవంబర్ లో రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉంది.అప్పటి వరకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని అంతవరకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చని విశ్లేషకుల అంచనా. ఒకవేళ అలా జరిగితే అది కాంగ్రెస్ కు నైతిక విజయమనే అనుకోవాలి.



