
164 సీట్లతో అత్యధిక మెజార్టీలతో కూటమి నేతలు ఘన విజయం సాధించినప్పటికీ టీడీపీ పార్టీలో మాత్రం ఇంకా కొంత రాజకీయ ఆందోళన కొనసాగుతూనే ఉంది. మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో ఎందరో టీడీపీ నేతలు కూటమి కోసం రాజకీయ త్యాగానికి సిద్ధపడ్డారు.
ఇందులో ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీనే అంటిపెట్టుకుని టీడీపీ నే తన రాజకీయ అవకాశంగా భావించి పార్టీ గెలుపు తో పాటు మిత్ర పక్షాల విజయానికి శ్రమించిన పసుపు తమ్ముళ్లు ఇంకా తమ అవకాశాల కోసం మౌనంగా అధినేత వైపు ఆశగా చూస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.
Also Read – ఏపీ మద్యం కుంభకోణంపై చర్యలు తీసుకోలేని నిసహాయత.. దౌర్భాగ్యమే!
వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమా, పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే SVSN వర్మ వంటి నేతలు తమకు పార్టీ తప్పక న్యాయం చేస్తుంది అనే గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కోసం తనకు బలమైన పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మ కు కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా ఇంకా అవకాశం దక్కలేదు.
అలాగే టీడీపీ జెండా, టీడీపీ కండువా తప్ప మరో పార్టీ వైపు కన్నెత్తి చూడని దేవినేని ఉమా కూడా రాజకీయాలలో తనకున్న సీనియారిటీకి, పార్టీ పట్ల తనకున్న సిన్సియారిటీకి బాబు తప్పక అవకాశం కల్పిస్తారు అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అనే సదుద్దేశంతో బాబు తీసుకున్న నిర్ణయానికి తల వంచి తన ఎమ్మెల్యే సీటుని త్యాగం చేసిన దేవినేనికి కూడా పార్టీ తప్పక న్యాయం చెయ్యాల్సిన పరిస్థితి.
Also Read – కొత్త జట్టుకు పాత గుర్తులు ఇవ్వగలడా..?
అలాగే తనకు సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించినప్పటికీ విజయవాడ వరదల సమయంలో బుడమేరు విలయతాండవం కట్టడికి ప్రభుత్వానికి, ఆయా శాఖ మంత్రికి తనవంతు సహకారం అందించి విజయవాడ ప్రజలకు చేతనైనంత సాయం చేసారు దేవినేని ఉమా. ఇలా ఈ ఇద్దరు నేతలు తమ వ్యక్తిగత స్వార్ధాన్ని విడిచి కూటమి కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం రెండు అడుగులు వెనక్కి తగ్గారు.
అయితే ఇలా టీడీపీ లో అనేకమంది నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం తమ పెద్ద మనసు చాటారు. వారిలో వంగవీటి రాధా ఒకరు. అలాంటి వారందరికీ తగిన న్యాయం చేయవలసిన బాధ్యత పార్టీ అధినేతగా బాబు పై ఉంటుంది. అయితే మూడు పార్టీల పొత్తు కారణంగా అవకాశవాదులు, ఆశావాదులు ఎంతమంది ఉన్నప్పటికీ అదృష్టవంతులు మాత్రం కొందరే అవుతారు. మరి ఆ కొందరులో ఉన్న ఆ అదృష్ఠవాదులెవ్వరో.?