
ఇటీవలే ఐపీఎల్ ముగిసింది అనుకున్నక్రికెట్ అభిమానులు నిరాశ చెందకుండా ఉండేందుకు అనువుగా టి-20 వరల్డ్ కప్ మొదలయ్యింది. అయితే జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత్, ఆసీస్,ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాక్, ఆఫ్రికా,విండీస్ వంటి పెద్ద జట్లనే కాక కెనడా, యూ ఎస్ ఏ , ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి మరెన్నో ఇతర చిన్న జట్టులు కూడా పాలు పంచుకున్నాయి.
తాజాగా ముగిసిన ఐపీఎల్ ఫైనల్స్ హోరా హోరి గా ఉంటుందని ఫాన్స్ సంబరపడగా, హైదరాబాద్ టీం మాత్రం చతికిలపడిపోయింది. ఇక ఐపిల్ శకం ముగిసింది అనుకున్న క్రికెట్ ప్రపంచం అంతా వరల్డ్ కప్ వైపు చూసారు. అయితే మొదటి మ్యాచ్లు అన్ని చిన్న మ్యాచ్లే, చూసేందుకు ఆసక్తి గా ఉండవని అందరు అనుకున్నారు.
Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!
అయితే ఎవరి అంచనాలకు అందకుండా అన్ని మ్యాచ్లూ ఆసక్తిని కలిగిస్తున్నాయి. పాక్ జట్టు అమెరికా చేతిలో ఓడిపోవడం, ఆఫ్గాన్ వారు న్యూజిలాండ్ వంటి జట్టును ఓడించటం, మొదటి మ్యాచ్ అయిన నమీబియా vs ఓమన్, చివరి బంతి వరుకు వెళ్లి సూపర్ ఓవర్ సైతం ఆడటం వంటి ఎన్నెన్నో వింత సంఘటనలు ఇప్పటికే చోటు చేసుకున్నాయి.
అయితే రేపు భారత కాలమానం ప్రకారం 8 గంటలకు మొదలవబోయే ఇండియ vs పాక్ మ్యాచ్ పైనే అందరి కళ్ళు. ఈ టోర్నీ కే హైలైట్ గా ఈ మ్యాచ్ ను భావించవచ్చు. ఇప్పటికే పాక్ జట్టు ఒక మ్యాచ్ లో ఓటమి చెందగా, వారు తరువాయి స్టేజి కు అర్హత సాధించాలి అంటే మిగిలిన మూడు మ్యాచ్ ల లో గెలిచి తీరాలి.
Also Read – శాసనసభ సమావేశాలు: జగన్ స్టోరీ మామూలే!
మరో వైపు భారత జట్టు ఆడిన ఒక్క మ్యాచ్ లో గెలిచి, మంచి జోరు మీద ఈ మ్యాచ్ లో కి వస్తున్నారు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో కొన్ని వింత సంఘటనలు చూసాం, మొదలయిన ఈ కొద్ది రోజుల్లోనే ఇన్ని వింతలు క్రికెట్ అభిమానులను ఊరిస్తుంటే..టోర్నీ ముగిసే నాటికి
మరిన్ని మ్యాచ్లు ప్రేక్షకులకు నయనానందాన్ని కలిగిస్తాయో చూడాలి.
అయితే రేపు జరగనున్న ఇండియా vs పాక్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో.. గెలిచి, ఎవరు సూపర్ 8 కు అర్హత ని సాధిస్తాయోనని..? ఆసక్తిగా చూస్తున్నారు క్రికెట్ ప్రేమికులు.