ప్యాలస్ రాజకీయాలతో వైసీపీ మళ్ళీ గెలుస్తుందా?

Jagan Win Elections

ఆంధ్రాలో టీడీపి, వైసీపీ అధినేతల పనితీరు, వారి ఆలోచనా విధానాలు చాలా భిన్నంగా ఉంటాయని అందరికీ తెలుసు. జగన్‌ 2019 లో అధికారంలోకి రాగానే 2024 ఎన్నికలే లక్ష్యంగా అనేక పధకాలు, రాజకీయ వ్యూహాలు అమలు చేశారు.

అవన్నీ బెడిసికొట్టినప్పటికీ, జగన్‌ 5 ఏళ్ళు ముందుగానే ఎన్నికలలో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా పనిచేశారని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

అంతకు ముందు జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల మధ్యే ఉండేవారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుండేవారు.

కానీ పదవి, అధికారం కోల్పోయిన తర్వాత జగన్‌ ఆలోచనా విధానం, రాజకీయ వ్యూహాలు మరోసారి మార్చుకున్నారు.

ఇప్పుడు పరామర్శ యాత్రల పేరుతో అప్పుడప్పుడు ప్రజల మధ్యకు వచ్చి తనకు ప్రజాధరణ తగ్గలేదని, పార్టీ శ్రేణులు ఎప్పటిలాగే చాలా ఉత్సాహంగా ఉన్నారని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ అప్పటికీ, ఇప్పటికీ ఒకే విషయంలో జగన్‌లో మార్పు రాలేదు. అదే.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తుండటం.

ప్రజలతో, పార్టీ శ్రేణులతో మమేకం అవ్వాల్సిన జగన్‌, తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని సోషల్ మీడియా ద్వారానే వైసీపీని, రాష్ట్ర రాజకీయాలు నడిపించాలని ప్రయత్నిస్తున్నారు.

ఈవిదంగా ప్యాలస్‌ నుంచి బయటకు రాకుండా వచ్చే ఎన్నికలలో మళ్ళీ మనమే గెలుస్తామని జగన్‌ ఏ ధీమాతో చెపుతున్నారో ఎవరికీ అర్ధం కాదు.

ప్రజలు, పార్టీ శ్రేణుల మద్య ఉండాల్సిన జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చుంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటున్నారు సిఎం చంద్రబాబు నాయుడు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మద్య ఉండటం వేరు. ముఖ్యమంత్రి హోదాలో ప్రజల మద్య ఉండటం వేరు.

ఇప్పుడు సిఎం హోదాలో చంద్రబాబు నాయుడు ప్రజల మద్య తిరుగుతూ తన పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలలో సదాభిప్రాయం ఏర్పడేలా చేసుకుంటున్నారు.

కూటమిలో జనసేన, బీజేపిలతో అలాగే కేంద్రంతో కూడా సంబంధాలు బలపరుచుకున్తున్నారు. ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పధకాలు అమలు చేయడానికి వెనకాడటం లేదు. ఇవన్నీ 2029 ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించడానికేనని వేరే చెప్పక్కరలేదు.

చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికల కోసం పని మొదలుపెట్టారు. కానీ జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌ నుంచే రాజకీయాలు చేస్తూ ‘మళ్ళీ మనమే’ అని వైసీపీ శ్రేణులను నమ్మమంటున్నారు. అంటే ఇదివరకు 175/175 మనకే అని నమ్మమన్నట్లన్న మాట!

సిఎం చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు చేస్తుంటే, జగన్‌ ఊహాలోకంలో విహరిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంత గట్టిగా ప్రయత్నిస్తేనే ఎన్నికలలో వైసీపీ గెలవలేకపోయింది.

ఓ పక్క సిఎం చంద్రబాబు నాయుడు ఈవిదంగా దూసుకుపోతుంటే, ఊహాలోకంలో విహరిస్తున్న జగన్‌ ఏవిదంగా వైసీపీని ఎన్నికలలో గెలిపించుకోగాలరో ఆయనకీ… ఆయననే నమ్ముకున్న నేతలకీ…. వారినే నమ్ముకున్న వైసీపీ కార్యకర్తలకే తెలియాలి.

ADVERTISEMENT
Latest Stories