సమ్మర్ సీజన్ రాగానే ముద్దుగుమ్మలందరూ బీచ్ ల పక్కన దర్శనమివ్వడం సహజం. ఈ క్రమంలో ఇప్పటికే ఒకరిద్దరూ టాప్ హీరోయిన్లు తమ పొదుపైన దుస్తులను ధరించి, సోషల్ మీడియాలో హీట్ ను రాజేశారు. అయితే తాజాగా ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా తమన్నా తారసపడింది.
ఇంకేముంది… వైరల్ కూడా కాదు, ‘వైరల్ కా బాప్’ అన్న స్థాయిలో ఈ బ్యూటీ ఫోటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. అసలే మిల్కీ స్కిన్ టోన్… ఆ పైన పింక్ బికినీ..! చెప్పడం కంటే చూడడమే బెటర్ అన్న చందంగా మిల్కీ బ్యూటీ అవుట్ ఫిట్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.
అందులోనూ మొట్టమొదటిసారిగా తమన్నా ఇంత హాట్ గా కనిపించడంతో, ఫ్యాన్స్ ‘ఐ ఫీస్ట్’గా మారిపోయింది. బాలీవుడ్ బ్యూటీస్ కియారా అద్వానీ, దిశా పటాని, అలియా భట్, సోనమ్ కపూర్, నిధి అగర్వాల్ వంటి వారు ఇలాంటి కాస్ట్యూమ్స్ లో అందాల విందు చేసారు గానీ, మిల్కీ బ్యూటీ మాత్రం ఇప్పుడే అరంగ్రేటం చేసింది.
ఈ స్కిన్ షో వెనుక ఆంతర్యం ఏమిటి? బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ లను తన ఖాతాలో వేసుకునే క్రమంలో వేసిన ఎత్తుగడ? లేక సమ్మర్ రిలీఫ్ లో భాగంగా నెటిజన్లకు, అభిమానులకు ఊరటనిచ్చే విధంగా కాస్తంత మోతాదు పెంచిందా? ఏది ఏమైనా మిల్కీ బ్యూటీ అందాల ప్రదర్శన మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.