‘తమిళనాట’ పట్టుబడ్డ 570 కోట్లలలో ‘ఏపీ’ ట్విస్ట్!

CBI 570 crores, Tamil Nadu CBI 570 crores, Tamil Nadu Elections CBI 570 crores, CBI 570 crores Cash, Tamil Nadu CBI 570 crores Trucksతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు లారీ కంటైనర్లలో పట్టుబడ్డ 570 కోట్ల కేసు కీలక మలుపు తిరిగింది. సరిగ్గా ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపింది. దీంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను మద్రాస్ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐకు ఓ కీలక ఆధారం లభించిందని సమాచారం.

ADVERTISEMENT

కోయంబత్తూరులోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖ నుంచి విశాఖలోని అదే బ్యాంకు శాఖకు ఈ నగదును తరలిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే మూడు కంటెయినర్లలో తరలిస్తున్న ఈ నగదుకు భద్రతగా ఏ ఒక్క సాయుధ పోలీసు లేని వైనంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. తమిళనాడు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఈ నగదును తరలిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తున్నట్లుగా తాజాగా సీబీఐకు లభించిన ఆధారం చెప్తోంది.

నగదును తరలిస్తూ పట్టబుడ్డ మూడు కంటెయినర్లకు వాటి అసలు నెంబర్లు కాకుండా ఏపీకి చెందిన మూడు బైక్ ల నెంబర్ ప్లేట్లను తగిలించడం… ఈ కధలో అసలు ‘ట్విస్ట్’కు దారి తీసింది. కంటెయినర్లపై ఉన్న నెంబర్లు ఏపీ 13ఎక్స్5204, ఏపీ 13ఎక్స్8650, ఏపీ 5203 13ఎక్స్… ఏపీకి చెందిన మూడు బైక్ లకు సంబంధించినవని సీబీఐ నిర్ధారించింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories