తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇదే ప్రధమం!

P Chidambaram - Tamilnadu congress125 ఏళ్ళ వయసు గల గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ దీపం తమిళనాడులో దాదాపుగా ఆరిపోతోంది. తొలిసారిగా ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగిల్ ఎంపీ కూడా పార్లమెంటు ఉభయ సభల్లో లేని పరిస్థితి దాపురించింది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం లాంటి సీనియర్ నేతలున్నా తమిళ తంబీలు కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం ఆదరించలేదు.

తాజాగా రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి సింగిల్ సీటు కూడా దక్కే పరిస్థితి లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే ఆ పార్టీ మిత్రపక్షం డీఎంకే 89 సీట్లను మాత్రమే దక్కించుకుంది. ఈ బలంలో ఆ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఈ రెండు సీట్లకు తన పార్టీ నేతలనే ప్రకటించిన డీఎంకే… కాంగ్రెస్ కు అవకాశం కల్పించలేదు. దీంతో అటు లోక్ సభలోనే కాకుండా ఇటు రాజ్యసభలోనూ తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి సింగిల్ సభ్యుడు లేకపోవడం రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories