ఆంధ్రాలో టాటాగ్రూప్ పెట్టుబడి రూ.49,000 కోట్లు!

Tata Group Huge 49000cr Investments

ఆనాడు జగన్‌ అరాచక పాలన చూసి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఏపీకి ‘టాటా బైబై’ చెప్పేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయేవారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ ఏపీకి తరలివస్తున్నారు. అలా వస్తున్న వాటిలో టాటా పవర్ కంపెనీ కూడా ఒకటి.

టాటా కంపెనీ ఆంధ్రాలో రూ.49,000 కోట్ల పెట్టుబడితో పునరుత్పాతక విద్యుత్ (సోలార్, విండ్ మిల్స్) ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 7,000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో సోలార్ మరియు విండ్ మిల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిలో 4,200 మెగావాట్స్ సోలార్, 2,800 మెగావాట్స్ విండ్ మిల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయబోతోంది.

ADVERTISEMENT

అనంతపురం జిల్లాలో 2,200 మెగావాట్స్, కర్నూలు, కడప జిల్లాలలో 1,800 మెగావాట్స్, ప్రకాశం జిల్లాలో 1,200 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతోంది.

ఈ నాలుగు జిల్లాలో ఏర్పాటు చేయబోయే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్స్ ద్వారా సుమారు 33,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించబోతున్నాయి.

వీటి నిర్వహణకు అవసరమైన సేవలు, ఉత్పత్తులు అందజేస్తూ మరికొన్ని వేలమందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

ఈ నాలుగు జిల్లాలో టాటా ప్లాంట్స్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రానికి ఈ మేరకు అదనపు విద్యుత్ అందుబాటులోకి రావడమే కాకుండా పన్నుల రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.3,000 కోట్ల వరకు ఆదాయం కూడా లభిస్తుంది.

ఇదికాక టాటా గ్రూప్ సంస్థలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సరవీశాస (టిసిఎస్) విశాఖపట్నంలో ఐటి కంపెనీ ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే వీటి ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా టాటా సంస్థలకి మద్య ఒప్పందం కూడా జరిగింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా పెద్ద లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నారు. ఈ పునరుత్పాతక విద్యుత్ ఉత్పత్తి రంగంలో 160 గిగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి సాధించాలని దీని కోసం రాబోయే 5 ఏళ్ళలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీని కోసం గత ఏడాది అక్టోబర్‌లో ఇంటిగ్రేటడ్‌ క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పాలసీ వల్లనే ఏపీకి సోలార్, విండ్ మిల్స్, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories