chandrababu-naidu-tata

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతిలో టాటా గ్రూప్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, పెట్టుబడులకు పోటీ పడుతున్నందున, పాత పద్దతిలో ప్రయత్నాలు సాగిస్తే ఆశించిన ఫలితాలు రావని, సరికొత్త ఆలోచనలు, విధానాలతో ముందుకు సాగాలని టాటా గ్రూప్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ సిఎం చంద్రబాబు నాయుడుకి చెప్పిన్నట్లు తెలుస్తోంది.

Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?

ఆయన ప్రతిపాదన మేరకు చంద్రబాబు నాయుడు ఛైర్మన్‌గా, చంద్రశేఖరన్‌ కొ- ఛైర్మన్‌గా ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో ఆనంద్ మహీంద్ర వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వాణిజ్యవేత్తలు, ఐ‌టి కంపెనీల సీఈవోలు సభ్యులుగా ఉంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ఎటువంటి విధానాలు అనుసరించాలో, వాటి కోసం వ్యవస్థలలో ఎటువంటి మార్పులు చేసుకోవాలో, ఏవిదంగా ముందుకు సాగాలో వారు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.

Also Read – ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!

ఆ ప్రకారమే ప్రభుత్వం అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలనే భాగస్వాములుగా చేయాలనే ఆలోచన వలన వారి స్వయంగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తారు.

అమరావతి కేంద్రంగా సీఐఐ భాగస్వామ్యంతో ‘స్టేట్ ఆఫ్ సెంటర్‌ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్’ కేంద్రం ఏర్పాటుకాబోతోంది. దానిలో టాటా గ్రూప్ భాగస్వామిగా ఉండేందుకు చంద్రశేఖరన్ అంగీకరించారు.

Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?

అలాగే టాటా గ్రూప్ అధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరాలు, పట్టణాలకు నడిపించాలని, అమరావతి లేదా విశాఖలో టాటా గ్రూప్ సంస్థలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నాయుడు చంద్రశేఖరన్‌కు విజ్ఞప్తి చేశారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది.




సిఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి టాటా గ్రూప్‌లో ఏ ఒక్క సంస్థని రప్పించగలిగినా అది గొప్ప శుభారంభమే అని చెప్పవచ్చు. అటువంటి ప్రముఖ సంస్థ ఒకటి వస్తే, మిగిలిన సంస్థలకి ఏపీపై మళ్ళీ నమ్మకం ఏర్పడుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. సిఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలించి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని ఆశిద్దాం.