చంద్రబాబుకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దు

TDP

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే నెల రోజులైంది. కానీ ఇంతకాలం మమ్మల్ని వేటాడి వేధించిన వైసీపి నేతల భరతం పట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, జిల్లా స్థాయిలో వైసీపి నేతలకు అనుకూలంగా వ్యవహరించిన సీఐలు, ఎస్సైలను ఇంకా ఎందుకు మార్చడం లేదంటూ టిడిపిలో వైసీపి బాధిత నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి మూకలు చెలరేగిపోయి వైసీపి నేతల ఇళ్ళు, కార్యాలయాలు, వైఎస్సార్ విగ్రహాలపై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నాయని వైసీపి నేతలు, వారి సొంత మీడియా పదేపదే ఆరోపణలు చేస్తున్నారు.

ADVERTISEMENT

జగన్‌ పాలనలో చంద్రబాబు నాయుడుతో సహా టిడిపిలో ప్రతీ ఒక్కరూ ఏదోవిదంగా వేధింపులను భరించినవారే. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాము కనుక దానికి వైసీపి నేతలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం మానవ సహజం.

“కానీ అలాచేస్తే టిడిపికి వైసీపికి తేడా ఏముంటుంది. కనుక వైసీపి నేతలపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుందాము. ఆవేశంతో ఎవరూ ఎవరిపై భౌతిక దాడులు చేయొద్దు. చేస్తే సహించను,” అని సిఎం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఇది టిడిపిలో వైసీపి బాధిత నేతలు, కార్యకర్తలకు చాలా అసహనం కలిగిస్తోంది. అధికారంలోకి వచ్చినా మమ్మల్ని వేధించినవారిని ప్రభుత్వం ఏమీ చేయలేకపోతే ఎలా? ఏదో ఒకటి చేయాల్సిందే,” అంటూ ఒత్తిడి చేస్తున్నారు.

మరోపక్క వైసీపి నేతలు, వారి మీడియా పనికట్టుకొని ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన దానిని భూతద్దంలో నుంచి చూపిస్తూ చంద్రబాబు నాయుడు సిఎం కాగానే మాపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. టిడిపి శ్రేణులు మాపై దాడులు చేస్తుంటే ఆయన చూసి చూడన్నట్లు ఊరుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

తద్వారా టిడిపి నేతలు, కార్యకర్తలు తమ జోలికి రాకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. రఘురామ కృష్ణరాజు పిర్యాదుపై గుంటూరు పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేస్తే, వైసీపి నేతలు వారి మీడియా ఏదో అనర్ధం జరిగిపోతున్నట్లు మాట్లాడుతుండటమే ఇందుకు చిన్న ఉదాహరణ.

దీంతో చంద్రబాబు నాయుడు రెండు వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తోంది. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. కనుక టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా తమ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితిని అర్దం చేసుకొని, ఆయన సూచించిన్నట్లు సంయమనం పాటించడం చాలా అవసరం. లేకుంటే వారి వలన చంద్రబాబు నాయుడుకి, టిడిపి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని మరిచిపోకూడదు.

ADVERTISEMENT
Latest Stories