బాబు గారి లెక్కలు… 15 నిముషాల్లో… 1500 రోజులు..!

TDP-Chandrababu-Naiduరాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1500 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లాలోని కొల్లూరులో చంద్రబాబు నాయుడు ఓ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బాబు… రాష్ట్రం బాగుపడాలని తనను గెలిపించారని, 1500 రోజులు 15 నిమిషాల్లా గడిచిపోయాయని అన్నారు. దేశంలో సుపరిపాలనకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అని, పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఓ టీమ్ లా పనిచేస్తున్నామని, టీమ్ లీడర్ గా అందరినీ సమన్వయం చేస్తున్నానని, సవాళ్లకు భయపడకుండా విజన్ డాక్యుమెంట్ రూపొందించానని అన్నారు.

1500 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంగా ‘గ్రామ దర్శిని,’ పార్టీ కార్యక్రమంగా ‘గ్రామ వికాసం’ నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఆనందం కూడా పెరగాలని, 2050 నాటికి ప్రపంచంలోనే ఏపీ అగ్రరాష్ట్రంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సులభతర వాణిజ్యంలో మనం ముందున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులువస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, 5 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయబోతున్నామని అన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories