Pawan-Kalyan-nara-Chandrababu

టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల కలయిక ఏపీ రాజకీయాలలో సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో జరిగిన మూడు ఎన్నికలలో ఈ మూడు పార్టీల కలయికతో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Also Read – పవన్ ఇచ్చేశారు… జగన్‌ పుచ్చుకుంటున్నారు!

ఏపీలో సక్సెస్ ఫార్ములాగా మారిన ఈ పొత్తు తెలంగాణలో అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలుగుతుందా? అంటే రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనే నానుడి నిజమనిపిస్తుంది. 151 సీట్లతో దేశంలోనే బలమైన ప్రభుత్వంగా నిలిచిన వైసీపీ ప్రభుత్వాన్ని కూటమి పొత్తు విచ్ఛిన్నం చేయగలిగింది.

వైసీపీని అధికారానికి దూరం చెయ్యడమే కాదు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా దగ్గర కాకుండా చేయగలిగింది. తెలంగాణలో టీడీపీకి నాయకత్వ లోపమే తప్ప మరో సమస్య లేదనేది ఈ మధ్య హైద్రాబాద్ లో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చెప్పవచ్చు.

Also Read – చెప్పాల్సింది చెప్పేసి తూచ్ అంటే ఎలా బ్రహ్మాజీ?

బాబు పట్ల ఇప్పటికి అదే గౌరవం, టీడీపీ పట్ల ఇప్పటికి అదే ప్రేమాభిమానాలు తెలంగాణ ప్రజల మనస్సుల నిండా నిండి ఉన్నాయని బాబు అరెస్టు నేపథ్యంలో, కూటమి గెలుపు సమయంలో వారి చర్యలతో రుజువు చేసారు తెలంగాణ ప్రజలు.

అలాగే జనసేన కూడా తనను తానూ నిరూపించుకునే అవకాశం మొదటిసారిగా దక్కడంతో రెండు రాష్ట్రాల ప్రజలను తన వైపుకు ఆకర్షించుకోవడానికి అన్ని విధాలా వందకు వంద శాతం బాధ్యతగా, జవాబుదారిగా పని చేస్తుంది.

Also Read – తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న వర్షాలు..!

ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ బలం కాస్త ఎక్కువనే చెప్పాలి. ప్రతి ఐదేళ్లకొకసారి బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ అటు జాతీయ పార్టీ కాంగ్రెస్ కు ఇటు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కు గట్టి పోటీగా నిలుస్తూ వస్తుంది.




టీడీపీ బలం, జనసేన బాధ్యత, బీజేపీ కష్టం కలిపి ముందుకెళితే ‘కూటమి’ తెలంగాణలో కూడా మరో బలమైన శక్తిగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆదిశగా మూడు అడుగులు వేయడానికి మూడు పార్టీల అధినేతలు ముందుకొస్తారా? లేదా అన్నది మరో ఐదేళ్ల తరువాతే తేటతెల్లమవుతుంది.