టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఢీలా పడిన టిడిపి నేతలు, కార్యకర్తలు మళ్ళీ పుంజుకొని వైసీపి ప్రభుత్వ వైఫల్యాలపై యుద్ధం ప్రారంభించారు. ఈసారి వారికి జనసేన కూడా తోడవడంతో రెండు పార్టీలు కలిసి తమదైన శైలిలో వైసీపిపై విరుచుకు పడుతున్నాయి.
సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించుకొన్నట్లుగా నేడు, రేపు (శని,ఆదివారం) ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ’ అనే పేరుతో రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్ల వద్ద ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నాయి. గుంతలు పడిన రోడ్లను మాత్రమే అందరి దృష్టిని ఆకర్షించలేకపోవచ్చు.
కనుక జగన్మోహన్ రెడ్డి కారికేచర్ చిత్రాన్ని కూడా దానికి జోడించాయి. గుంతల సామ్రాజ్యాధీశుడు అంటూ నెత్తిన కిరీటం, పెద్ద మీసాలు పెట్టి లెట్రిన్ కమోడ్ మీద కాలు మీద కాలు వేసుకొని చేతులు కట్టుకొని కూర్చొన్నట్లు వేశారు.
వైసీపి నేతలు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ఆటాడుకోవడమే తప్ప ఈవిదంగా తిరిగి ర్యాగింగ్ రుచి చూడలేదు. కనుక దీనిని తట్టుకోవడం జీర్ణించుకోవడం కష్టమే.
అయితే రాష్ట్రంలో ప్రజలందరూ ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను ఈవిదంగా తమ దృష్టికి తీసుకువస్తున్నారని గ్రహిస్తే మంచిది. నిజానికి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి జనసేన, టిడిపిలు గత ఏడాది కూడా ఇలాగే వైసీపి ప్రభుత్వానికి గుర్తు చేశాయి.
రాష్ట్రంలో ప్రతిపక్షాలే కాకుండా పొరుగు రాష్ట్ర మంత్రులు కూడా పలుమార్లు ఏపీలో రోడ్ల దుస్థితిపై వ్యాఖ్యలు చేశారు. అయితే వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ముందే మరమత్తులు చేయించాల్సిన వైసీపి ప్రభుత్వం, తమ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న అందరిపై ఎదురుదాదులు చేస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేశారు.
కనుక చరిత్ర పునరావృతం అయిన్నట్లు మళ్ళీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ‘రాజధాని లేని గుంతల సామ్రాజ్యం’ గురించి మాట్లాడగలుగుతున్నాయని అనుకోవచ్చు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి లోపల వేయడంపై ఉన్న శ్రద్ద రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లను మరమత్తులు చేయించడంపై పెడితే ఈవిదంగా ఎవరూ వేలెత్తి చూపేవారే కాదు కదా?
కళ్ళకు గంతలు కట్టుకుని సామాజిక సాధికారత ఎవరికి చూపిస్తున్నావు జగన్ రెడ్డి? ముందు నీ కళ్ళు విప్పి రోడ్డు మీది గుంతలు చూడు. ఆ గుంతల్లో పడుతూ లేస్తూ నిన్ను తిట్టుకుంటున్న సమాజాన్ని చూడు.
#GunthalaRajyamAP #WhyAPHatesJagan pic.twitter.com/yHP7agHHfB— Telugu Desam Party (@JaiTDP) November 18, 2023




