వైయస్ జగన్ తో టిడిపి ఎమ్మెల్యే భేటీ!

TDP Leader Krishnaiah meets YS Jaganతెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగగా, భేటీ అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు పార్టీ పరంగా వైకాపా కూడా సహకరించాలని కోరేందుకే వచ్చినట్టు తెలిపారు.

ADVERTISEMENT

ఈ మేరకు పార్లమెంటులో బిల్లు పెట్టేలా ప్రధానికి లేఖ రాయాలని జగన్ ను కోరగా, మరో వారంలో లేఖను రాస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య వివరించారు. కాపులను బీసీల్లో చేరిస్తే, బడుగు వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ చర్యలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. టీడీపీ టికెట్ పై ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన కృష్ణయ్య పార్టీ తరపున కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories