
జగన్ వైసీపి కోసం సృష్టిచుకున్న వాలంటీర్ వ్యవస్థని వైసీపి నేతలు చివరి వరకు వాడుకున్నారు. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఈసీ ఆంక్ష విధించడంతో సుమారు లక్ష మంది వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఐదేళ్ళు వారిచేత వెట్టి చాకిరీ చేయించుకున్న జగన్, వైసీపి నేతలు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత వాలంటీర్లను రోడ్డున పడేసి చేతులు దులుపుకు వెళ్ళిపోయారు తప్ప ఎవరూ వారి గురించి ఆలోచించలేదు.
అయితే ఎన్నికల సమయంలోనే వాలంటీర్లు ఎదుర్కొంటున్న ఈ ఒత్తిళ్ళను గమనించిన చంద్రబాబు నాయుడు ఎవరూ ఉద్యోగాలకు రాజీనామాలు చేయవద్దని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారి సేవలను కొనసాగిస్తామని, ప్రస్తుతం నెలకు రూ.5,000 ఉన్న జీతాన్ని రూ.10,000 కి పెంచుతామని ప్రకటించారు.
Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?
ఆయన మాటపై నమ్మకం ఉంచిన సుమారు లక్షన్నర మంది వాలంటీర్లు ఉద్యోగాలలోనే కొనసాగుతుండగా, జగన్, వైసీపి నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి రాజీనామాలు చేసిన లక్ష మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు.
కానీ ఉద్యోగాలలో ఉన్న వాలంటీర్లను ప్రభుత్వం నేటికీ ఉపయోగించుకోకపోవడంతో వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
Also Read – ఒక్క ఫోన్‌కాల్‌తో వందకోట్లు అప్పు.. దటీజ్ విజయసాయి రెడ్డి!
టిడిపి కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తుందా లేదా?అని నేడు మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు పూర్తి స్పష్టత ఇచ్చారు.
“వాలంటీర్ వ్యవస్థని ప్రభుత్వం కొనసాగిస్తుందని, వారికి నెలకు రూ.10,000 జీతం ఇస్తామని ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే వాలంటీర్ల సేవలను ఏవిదంగా వాడుకోవాలనే దానిపై విధివిధానాలు రూపొందిస్తున్నాము. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తాము,” అని చెప్పారు.
Also Read – విశాఖ మేయర్ పీఠం కూటమికే… సంతోషమేనా?
ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత జగన్ అన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఒక్క వాలంటీర్ల గురించి తప్ప! జగన్ వైసీపి కోసం సృష్టించుకున్న వాలంటీర్లను మోసం చేసి వెళ్లిపోతే వారిని చంద్రబాబు నాయుడు ఆదుకుంటుండటం గొప్ప విషయమే కదా?