ఈనాడు: టిడిపిని విమర్శించడంలో కూడా ముందే!

tdp-mla-kolikapudi-srinivasa-demolished-ysrcp-construction

అధికార మదమనే క్యాటరాక్ట్ పొర రాజకీయ నాయకుల కళ్ళను కప్పేసినప్పుడు, మీడియా దానిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ వారికి కనువిప్పు కలిగించేలా చేస్తుంటుంది.

ADVERTISEMENT

ఈనాడు మీడియా కూడా అటువంటిదే అని చెప్పవచ్చు. గత 5 ఏళ్ళుగా జగన్‌ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే, సాక్షి మీడియా జగన్‌కు ఏర్పడిన ఆ క్యాటరాక్ట్ పొరను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయకుండా, ఆ పొర మరింత మందంగా పెరిగేలా చేసి ఆయన పతనానికి కారణం అయ్యిందని చెప్పక తప్పదు.

అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రతీ తప్పును, జరుగుతున్న ప్రతీ అనర్ధాన్ని, అరాచకాలను ఎత్తిచూపుతూ అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించేవి. కానీ జగన్‌ వాటి హెచ్చరికలను వేరేగా తీసుకొని వాటిపై ఎల్లో మీడియా అనే ముద్రవేసి చివరికి తానే నష్టపోయారు.

ఒకవేళ జగన్‌ మీడియా హెచ్చరికలను సానుకూలంగా స్వీకరించి ఉండి ఉంటే నేడు ఆయన పరిస్థితి మరోలా, ఆయన మరో స్థాయిలో ఉండేవారు కాదా?

ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా తప్పులు జరిగితే వేలెత్తి చూపేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు వెనకాడవు. అందుకే వాటికి అంత విశ్వసనీయత (క్రెడిబిలిటీ) ఏర్పడిందని చెప్పవచ్చు.

ఇందుకు తాజా నిదర్శనంగా తిరువూరు టిడిపి ‘ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అత్యుత్సాహం’ అంటూ నేడు ఈనాడు ఆన్‌లైన్‌లో సంచికలో వచ్చిన కధనమే.

నిజానికి ఆయన వైసీపి నుంచి ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఇప్పుడు ఆయనే ఎన్టీఆర్‌ జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపి ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి నిర్మించుకుంటున్న ఇంటిని అక్రమ నిర్మాణం అంటూ కూల్చేసేందుకు ప్రయత్నించారు.

పేదల స్థలాన్ని ఆక్రమించి నిర్మించుకుంటున్న ఆ భవనాన్ని తక్షణమే కూల్చివేయాలని లేకుంటే తానే కూల్పించేస్తానని అధికారులు, పోలీసులను హెచ్చరించారు. కానీ వారు స్పందించేలోగా ఆయన జేసీబీతో ఆ ఇంటిని పాక్షికంగా కూల్పించేశారు. ఆ తర్వాత చాలా సేపు అక్కడే ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

పిల్లి మెడలో గంట ఎవరు కడతారని ఎదురుచూడకుండా తప్పు జరిగితే దానిని ఈనాడు మీడియా ధైర్యంగా ఎత్తి చూపుతుంటుంది. టిడిపి ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఈవిదంగా ఎవరికి వారు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందనే విషయం ఈనాడు తెలియజేసింది. అందుకే దానికి ఇంత ప్రజాధరణ కలిగి ఉంది. ఈనాడు అధినేత రామోజీరావు చనిపోయిన తర్వాత కూడా అదే ప్రమాణాలు పాటిస్తుండటం అభినందనీయమే కదా?

ADVERTISEMENT
Latest Stories