జగన్ పై, సాక్షిపై ‘పరువు నష్టం’ దావా వేస్తా!

TDP MP CM Ramesh warning to Sakshi“తన పైన, తన కంపెనీ పైన ‘సాక్షి’ పత్రిక తప్పుడు కధనాలు రాస్తోందని” టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. ఇటువంటి వార్తలు రాసిన ‘సాక్షి’ పత్రికపై చర్యలు తీసుకోవాలని ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కు ఫిర్యాదు చేస్తానని, అలాగే వైసీపీ అధినేత జగన్ పై మరియు సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరికలు జారీ చేసారు.

ADVERTISEMENT

ఉత్తరప్రదేశ్ లో ఉన్న తన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారని ‘సాక్షి’ ప్రచురించిందని, ఆ విషయాన్ని నిరూపించాలని, ఆ విధంగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించ లేకపోతే ‘సాక్షి’ పత్రికను మూసివేస్తారా? అంటూ సవాల్ విసిరారు. అవినీతి డబ్బుతో పత్రిక పెట్టిన జగన్ కు, అందరూ అవినీతి పరులుగానే కనిపిస్తున్నారని సీఎం రమేష్ ఆరోపించారు.

ADVERTISEMENT
Latest Stories