వైసీపి నేతలకు తొత్తులుగా పనిచేసిన పలువురు పోలీస్ అధికారులు ఇప్పుడు టిడిపి నేతలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారిలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కూడా ఒకరు. ఆయన వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు విధేయంగా మెసులుకుంటూ గత ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను అరెస్ట్ చేసి, తోటవల్లూరు పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారు. కారణం ఏమిటంటే ఆయన జగన్ ప్రభుత్వం తీరుని విమర్శిస్తుండటమే.
ఇప్పుడు రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఎస్పీ జాషువా టిడిపి నేతలను తప్పించుకు తిరుగుతున్నారు. ఆరోజు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టిన జాషువాని పలకరించడానికి పట్టాభిరామ్ తన అనుచరులతో కలిసి గురువారం ఆయన కార్యాలయానికి వెళ్ళగా అక్కడ లేరు. దాంతో ఆయన విజయవాడలో నిర్మించుకున్న విలాసవంతమైన ఫామ్‌హౌస్‌కి వెళ్ళారు. కానీ అక్కడ ఆయన లేరు.
అప్పుడు పట్టాభిరామ్ అక్కడే ఉన్న కుర్చీలో బొకే, శాలువా పెట్టి ఆయనకు ఓ వీడియో సందేశం పెట్టారు. “అయ్యా జాషువాగారు ఆనాడు అర్దరాత్రి నన్ను పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టినందుకు మీకు అభినందనలు తెలిపి సన్మానిద్దామని వస్తే మీరు కనబడకపోవడంతో ఈ బొకే, శాలువా ఇక్కడ పెట్టి వెళుతున్నాను. దయచేసి వీటిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను,” అంటూ పట్టాభిరామ్ పెట్టిన ఆ వీడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఒక్క జాషువా మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా చాలా మంది అధికారులది ఇదే పరిస్థితి.
గతంలో అక్రమస్తుల కేసులలో జగన్మోహన్ రెడ్డికి కొమ్ముకాసిన ఐఏఎస్ అధికారులు, మాజీ మంత్రులు ఆయనతో పాటు జైలుకి వెళ్ళారనే విషయం అధికారులు గుర్తులేన్నట్లు వ్యవహరించినా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పదేపదే హెచ్చరించిన్నప్పుడైనా మేల్కొని నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి ఉండి ఉంటే, మహా అయితే సస్పెండ్ అయ్యేవారు లేదా వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు.
కానీ మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారనే ధీమాతోనే వైసీపి నేతల అండదండలు చూసుకొని చెలరేగిపోయారు. చెలరేగిపోయారు. ఇప్పుడు జగన్ కానీ వైసీపి నేతలు గానీ వారిని ఆదుకునేందుకు రారు. కానీ వైసీపి నేతలు చేయించిన తప్పుడు పనులకు ఇప్పుడు అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు కదా?
జగన్ ఆనందం కోసం తనకు పోలీస్ స్టేషన్ లో చీకట్లో ‘treatment‘ ఇచ్చిన IPS అధికారి ఇంటికి వెళ్లి బొక్కే ఇచ్చిన పట్టాభి
As the officer & family not available, he left a bouquet on his swing#TDP pic.twitter.com/5D5anbGwVh
— M9 NEWS (@M9News_) June 5, 2024




