TDP's Plans and Steps Towards AP Development Goals

2014 ఎన్నికలలో టీడీపీ సాధించిన విజయంతో విభజిత ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఐదేళ్లల్లోనే మారనున్నాయి అని ఆశించిన ప్రతి ఒక్కరికి వారి అంచనాల మేరకు ప్రభుత్వం నుండి అభివృద్ధి అందలేదనే చెప్పాలి.

ముఖ్యమంత్రిగా బాబు కి ఉన్న ట్రాక్ రికార్డు దృష్ట్యా టీడీపీ ప్రభుత్వం మీద అంచనాలు ఆకాశంలో ఉంటే వాటి అమలుకు కావాల్సిన ప్రభుత్వ ఆదాయం మాత్రం పాతాళంలో ఉండడంతో టీడీపీ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో తన ఆలోచనలను అమలు చేయలేకపోయింది.

Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?

రాజధాని ప్రకటన అందుకు తగ్గ అనుమతులు…తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, ఇతరత్రా భవనాల నిర్మాణం పూర్తి అయినప్పటికీ వైసీపీ చేసిన దుష్ప్రచారానికి టీడీపీ అధికారానికి దూరమయ్యింది. అయితే ఇప్పుడు 2024 లో మరోమారు అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ఈ సారి తన లక్ష్యాలను పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉంది.

అందులో భాగంగానే ఏపీ శాశ్వత రాజధాని అమరావతే అనేలా బలమైన సంకేతాలు ఇస్తున్నారు. అందుకు తగ్గట్టే ఐదేళ్ల అమరావతి అరణ్య రోదనకి మహర్దశ పట్టేలా రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, ప్రభుత్వ అధికారుల భవన నిర్మాణాలు, ఎమ్మెల్యే కోర్టర్స్, రోడ్డు రవాణా వ్యవస్థ పున్నరుద్దరికరణ వంటి వాటి పై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది.

Also Read – వర్మగారి త్యాగాలకు ఇదా బహుమతి?

అలాగే చంద్రబాబు కూడా రాజధానిలో తన ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇలా రాజధాని నిర్మాణంతో పాటుగా అటు ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు కోసం కూడా నిధుల వేట మొదలుపెట్టింది. ఇందులో భాగంగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘తల్లికి వదనం’, 15 వేలు, రైతు భరోసా కింద 20 వేలు ఈ మే నెల నుంచి అందించనుంది కూటమి ప్రభుత్వం.

అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇప్పటికే అమలులోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం, ఎటువంటి వాలంటీర్ల సహాయం లేకుండానే నెల మొదటి రోజునే పెన్షన్ 4 వేల రూ.లను లబ్దిదారుల ఇంటికే వెళ్ళి అందిస్తుంది. ఇక 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలనే ఆలోచన చేస్తుంది. తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని ఆర్థిక విధ్వంసాన్ని చూస్తున్నా, నా అనుభవం కూడా ఈ విద్వశాన్ని అంచనా వేయలేకపోయింది అంటూ బాబు పదే పదే వైసీపీ విధ్వంసాన్ని ప్రజల ముందుంచుతున్నారు.

Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?

అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం జూన్ నెల నాటికి ఒక్కో మత్సకార కుటుంబానికి 20 రూ. చొప్పున ఆర్థిక సాయం, DSC ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. దానికి తోడు ఏపీ అభివృద్ధికి ఉన్న ఏకైన మార్గం పెట్టుబడుల సమీకరణ. ఆ పనిని కూడా సమర్ధవంతంగా పూర్తి చేసి ఏపీని పొరుగు రాష్ట్రాలకు పోటీగా నిలబెట్టడానికి బాబు తన 40 ఏళ్ళ రాజకీయం అనుభవాన్ని, లోకేష్ తన రాజకీయ భవిష్యత్ ను పెట్టుబడిగా పెట్టి పరిశ్రమల రాక కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.




వీటితో పాటుగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని వైసీపీ దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ప్రజలలో ఎండగడుతున్నారు. ఇలా ఈ ఐదేళ్లలోనే రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, పారిశ్రామిక ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల అమలు, అలాగే పార్టీ బలోపేతానికి కావాల్సిన ప్రణాళికలు అన్ని అంశాల మీద బాబు స్పష్టమైన ప్రణాళికతో, టీడీపీ నిర్దిష్టమైన లక్ష్యం దిశగా అడుగులు వేస్తునట్టు కనిపిస్తుంది.