పార్లమెంట్ లో ప్రతిష్టాత్మక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా తెలుగు దేశం పార్టీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్, అన్నాడీఎంకే, సీపీఎం, సీపీఐలు రమేష్‌కు ఓటేశాయి. సీఎం రమేష్ ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలుగు దేశం కాంగ్రెస్ బద్ద శత్రువులని అందరికి తెలిసిందే.
[m9ad]
దానితో ఈ ఎన్నిక అందరిని ఆశ్చర్యపరిచింది. గతంలో విభజన సమయంలోనూ ఈ మధ్య ఏపీకి జరుగుతున్న అన్యాయంపై సీఎం రమేష్ తన గళాన్ని విప్పుతున్నారు. విభజన హామీల అమలుపై రాజ్యసభ వేదికగా కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఇటీవలే కడపకు స్టీల్ ప్లాంట్ కోసం ఆయన నిరాహార దీక్షకు కూడా కూర్చున్నారు.
దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పినప్పటికీ ఎంపీ తన దీక్షను కొనసాగించారు. ప్లాంట్ వచ్చే వరకు పోరాటం ఆగదని అప్పట్లో స్పష్టం చేశారు. తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆయన దీక్షను విరమించారు. దీక్ష విరమించాకా స్టీల్ ప్లాంటు వచ్చే వరకు తన గడ్డం తియ్యను అని ప్రతిజ్ఞ చేసారు.



