tdp-reached-one-crore-membership-drive

ఒక రాజకీయ పార్టీని అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నాలుగు దశాబ్ధాలపాటు నడిపించడమే చాలా గొప్ప విషయం. అందునా రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత దాని మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది.

ఇక జగన్‌ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ప్రత్యర్ధులను తుడిచి పెట్టేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, పార్టీని కాపాడుకోవడం దాదాపు అసంభవమే. కానీ చంద్రబాబు నాయుడు ఈ రెండు అతిపెద్ద అగ్నిపరీక్షలని ఎదుర్కొని టీడీపీని కాపాడుకోవడమే కాక మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చారు కూడా.

Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు అంగరంగ వైభవంగా ‘మహానాడు’ నిర్వహించారు. అటువంటి విపత్కర పరిస్థితులలో కూడా టీడీపీని సభ్యత్వ నమోదుతో మరింత బలపరుచుకున్నారు. అప్పుడే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినప్పుడు, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సభ్యత్వ నమోదు ఏ స్థాయిలో ఉంటుందో ఎవరూ ఊహించి ఉండరు.

ఒక్క సంక్రాంతి పండుగ రోజునే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 20 వేల మంది కొత్తగా టీడీపీ సభ్యత్వం స్వీకరించారు. ఇదివరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కంచుకోటగా చెప్పుకోబడిన నెల్లూరు నగరంలో అత్యధిక సభ్యత్వ నమోదుతో నంబర్ 1 స్థానంలో నిలువగా, రెండో స్థానంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి, మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గం మూడో స్థానంలో నిలిచాయి.

Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?

ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని అడ్రస్ లేకుండా తుడిచిపెట్టేస్తామని జగన్‌ గొప్పలు చెప్పుకున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదులో 5వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయిందని భావిస్తున్నవారికీ 15 లక్షల సభ్యత్వాలు షాక్ ఇస్తాయి.




టీడీపీ ప్రస్తుతం అధికారంలో ఉన్నందున చాలా బలంగా ఉంది. అయినప్పటికీ పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకొంటూనే ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌ విడిచి బయటకు రాకపోవడం వలన సభ్యత్వ నమోదు కాదు కదా కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు.

Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?