పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 18 నుంచి ఆగస్టు 10వరకు జరిగే ఈ సెషన్‌లో మొత్తం 18 రోజులు సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లో ట్రిపుల్ తలాఖ్ బిల్లు, ఇతర వెనకబడిన వర్గాల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుల గురించి చర్చకు వచ్చే అవకాశమున్నట్లు కేంద్రం భావిస్తోంది.
అయితే ఈ సెషన్ ను సజావుగా సాగనిచ్చే అవకాశం లేదు. కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెట్టి ఎలాగైనా చర్చ పెట్టాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది. అయితే అవిశ్వాసతీర్మాణానికి ఒప్పుకోవాలి లేకపోతే మొత్తం సెషన్ అంతా పోగొట్టుకోవాలి. కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి.
మరోవైపు ఈ పార్లమెంట్ సెషన్ కు వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రాతినిథ్యం ఉండబోవడం లేదు. ఇటీవలే ఆ పార్టీలో మిగిలిన ఐదుగురు నామినేషన్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనితో ఇక ఆ పార్టీకి పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేసే అవకాశం లేదు. టీడీపీ పోరాడి ప్రజలను మెప్పించగల్గితే మాత్రం జగన్ బాధ పడక తప్పదు.



