పంచాయితీ, వార్డు ఉపఎన్నికలలో టిడిపి హవా… దేనికి సంకేతం?

Panchayat Ward by-electionsఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిద జిల్లాలోని 35 గ్రామ సర్పంచ్‌ పదవులకు, 245 వార్డు సభ్యుల స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కొద్దిపాటి స్థానాలతో రాష్ట్ర ప్రజల నాడి ఇలాగే ఉంటుందని చెప్పలేము కానీ రాష్ట్రంలో 97 శాతం మందికి తమ సంక్షేమ పధకాలు అందాయని, వాటితో 51 శాతం ప్రజలు వైసీపీవైపే ఉన్నారని విజయసాయి రెడ్డి నిన్ననే చెప్పుకొన్నారు.

పైగా ఈ ఉప ఎన్నికలలో కూడా వైసీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంచిపెట్టి ప్రలోభపెట్టారు. అనేకచోట్ల టిడిపి నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు కూడా చేశారు. కనుక ఈ ఉపఎన్నికలలో కూడా టిడిపికి అవకాశం లేకుండా వైసీపీ క్లీన్ స్వీప్ చేసి ఉండాలి. కానీ ఈ ఉపఎన్నికలలో కూడా టిడిపి బలపరిచిన అభ్యర్ధులే ఎక్కువ మంది గెలవడం గమనిస్తే వైసీపీ ఎన్ని సంక్షేమ పధకాలు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజల ఆలోచనలో మార్పు వస్తోందని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

జిల్లాల వారీగా వార్డు మెంబర్స్ ఎన్నికల ఫలితాలలో టిడిపి గెలుచుకొన్నవి:

వైస్సార్ జిల్లా: రాజుపాలెం (9వ వార్డు)

నెల్లూరు జిల్లా: పులిగిలపాడు, వేములపాడు (7వ వార్డు), సాయిపేట (3వ వార్డు), పాతపాడు (5వ వార్డు)కృష్ణా జిల్లా: గండిగుంట (10వ వార్డు), పోలవరం (11వ వార్డు)

అనంతపురం జిల్లా: జంగంపల్లి గ్రామ సర్పంచ్‌ పదవిని టిడిపి గెలుచుకొంది.

ఏలూరు జిల్లా: చేగొండపల్లి (6వ వార్డు), సీతంపేట (5,11 వార్డులు), గోపన్నపాలెం, గోపన్నపాలెం (11వ వార్డు),

గుంటూరు జిల్లా: హాఫ్ పేట (7వ వార్డు)

బాపట్ల జిల్లా: చిలుమూరు (4వ వార్డు), దోనేపూడి (5వ వార్డు), మూల్పూరు (2వ వార్డు), బుద్దాం (6వ వార్డు) టిడిపి బలపరిచిన అభ్యర్ధులు గెలుచుకొన్నారు.

పల్నాడు జిల్లా: ఉప్పరపాలెం (8వ వార్డు), ఎండ్రాయి (2వ వార్డు), గుండ్లవల్లి (5వ వార్డు), మాదిపాడు

పశ్చిమగోదావరి జిల్లా: దమ్నేను (పంచాయితీ వార్డు) దొంగరావిపాలెం (7వ వార్డు), కస్పా పెంటపాడు (5వ వార్డు), తేతలి (8వ వార్డు), కొవ్వూరులోని (8వ వార్డు జనసేన)

అనకాపల్లి జిల్లా: లింగరాజుపాలెం (5వ వార్డు) లలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్ధులు గెలిచారు.

ADVERTISEMENT
Latest Stories