పల్నాడు జిల్లాలో ఇదివరకు ఒకసారి టిడిపి కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి తగులబెట్టారు. ఇవాళ్ళ మళ్ళీ జిల్లాలోని వినుకొండలో టిడిపి-వైసీపీ శ్రేణుల మద్య ఘర్షణ జరిగింది.
తమ సీనియర్ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమకేసులు ఎత్తివేయాలని కోరుతూ టిడిపి కార్యకర్తలు ర్యాలీగా వినుకొండ పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా, వారు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకొన్నప్పుడు, వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన అనుచరులతో కలిసి వారిని అడ్డుకొని తొడగొట్టి సవాల్ విసరడంతో ఇరువర్గాల మద్య గొడవ మొదలైంది.
వైసీపీ కార్యకర్తలు హటాత్తుగా కర్రలు బయటకు తీసి టిడిపి కార్యకర్తలపై దాడులు చేయడంతో వారు ముందే ప్లాన్ చేసుకొని వచ్చిన్నట్లు అర్దమవుతోంది. దాంతో టిడిపి కార్యకర్తలు కూడా ఎదురుదాడికి ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు కూడా టిడిపి కార్యకర్తలపైనే లాఠీ చార్జ్ చేసి తమ ప్రతాపం చూపారు.
దీంతో అక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో సిఐ సాంబశివరావు తుపాకీ తీసి గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అందరూ వెనక్కు వెళ్ళాలని హెచ్చరించారు.
టిడిపి కార్యకర్తలు తమ ర్యాలీలో ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు. వారిని వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అడ్డుకోకపోయుంటే ఈ ఘర్షణలు జరిగేవే కావు. టిడిపి కార్యకర్తలు వినుకొండ సీఐకి వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయేవారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్రమంగా మట్టి తవ్వేసుకొంటున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తుండటంతో, వారికి తగిన గుణపాఠం నేర్పించాలని ఎదురుచూస్తున్న ఆయన ఈరోజు ఈ అవకాశాన్ని ఈవిదంగా వాడుకొన్నట్లు అర్దమవుతోంది.
వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వయంగా తన అనుచరులను వెంటపెట్టుకువచ్చి తమపై కర్రలతో దాడులు చేయిస్తుంటేఅక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయకుండా తిరిగి తమపైనే లాఠీచార్జ్ చేయడాని టిడిపి నేతలు తప్పుపట్టారు. బస్టాండ్ వద్ద టిడిపి కార్యకర్తలపి వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని తెలుసుకొని జీవీ ఆంజనేయులు హుటాహుటిన అక్కడకు చేరుకొన్నారు.
అనంతరం జీవీ ఆంజనేయులు విలేఖరులతో మాట్లాడుతూ, “వైసీపీ పాలనతో ప్రతిపక్షాలపై దాడులు చేసే సంస్కృతి బాగా పెరిగిపొంది. ఎవరైనా తమని ప్రశ్నిస్తే వారిమీద భౌతికదాదులు చేస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తున్నారు.
నాపై తప్పుడు కేసులను రద్ధు చేయాలని కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేసుకొంటుంటే, వారిని అడ్డుకొని లాఠీ చార్జ్ చేయడమే కాక మళ్ళీ వారిపై కూడా తప్పుడు కేసులు కూడా నమోదు చేయడం గమనిస్తే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏవిదంగా పనిచేస్తోందో అర్దం చేసుకోవచ్చని జీవీ ఆంజనేయులు అన్నారు.



