పదో తరగతిలోనే ప్రేమ పాఠాలు, పెళ్ళి…

Teacher Marries Student

మన దేశంలో తల్లితండ్రులు తర్వాత ఉపాధ్యాయుడుకి అంత గౌరవం లభిస్తుంది. గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానమని కీర్తిస్తారు. కనుక గురు-శిష్య బంధం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటాము. కానీ వేగంగా మారుతున్న సమాజంలో ఆ గురు-శిష్యుల బంధం కూడా ప్రశ్నార్ధకంగా మారుతోంది.

భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన గురువులే కీచకుల్లా మారుతున్నారు. కన్న బిడ్డలా ప్రేమించాల్సిన విద్యార్ధులతోనే ప్రేమాయణాలు నడిపిస్తున్నారు.

ADVERTISEMENT

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం డివిజన్‌లో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇదే జరిగింది. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు పర్రే మైటీన్ పదో క్లాసు విద్యార్ధినిని ప్రేమలో దింపాడు.

కొన్నాళ్ళ ప్రేమాయణం తర్వాత రహస్యంగా పెళ్ళి చేసుకొని రహస్యంగా కాపురం కూడా పెట్టేశాడు. కొన్ని రోజుల క్రితం ఆమె మెడలో పసుపు తాడు ఉండటం చూసి సాటి విద్యార్ధినులు అడిగారు. ఏదో మొక్కు కోసం కట్టుకున్నానని ఆ బాలిక నమ్మబలికింది.

కానీ కూతురు మెళ్ళో పసుపు తాడు చూసిన తల్లికి విషయం అర్ధమైంది. కూతురుని గట్టిగా నిలదీస్తే విషయం బయటపడింది.

ఆమె తల్లితండ్రులు పాఠశాలకు వెళ్ళి ఆ ఉపాధ్యాయుడిని నిలదీసే వరకు కూడా ఈ విషయం గురించి ప్రిన్సిపల్‌కు తెలియలేదు. కనీసం అప్పటికైనా ప్రిన్సిపల్‌, ఆ పాఠశాల యాజమాన్యం తప్పు జరిగినట్లు ఒప్పుకోలేదు.

దాంతో ఆ బాలిక తల్లితండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. మైనర్ బాలికని పెళ్ళి చేసుకొని శారీరిక సంబంధం పెట్టుకునందుకు పోలీసులు పొక్సో చట్టం కింద పర్రే మైటీన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై కూడా వేరేగా కేసు నమోదు చేశారు.

గురు-శిష్యుల సంబంధం ఈవిధంగా దిగజారడానికి కారణం ఏమిటి? అంటే ఒకటి కాదు అనేక సమాధానాలు కనిపిస్తాయి. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, బలహీనమైన కుటుంబ సంబంధాలు మొదలు సినిమాల వరకు అనేకం కనిపిస్తాయి. ఈ ప్రభావాల నుంచి పిల్లలను కాపాడుకోవడం తల్లితండ్రులకు పెద్ద అగ్నిపరీక్షగా మారింది.

ADVERTISEMENT
Latest Stories