గత ఏడాది ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు నేటి టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్. 2024 లో మొదటి సారిగా ఫుల్ టైం కోచ్ స్థానంలో ఉన్న గౌతమ్ తన మొదటి అడుగుతోనే ఆ టీంకి ఐపీఎల్ కప్పును అందించారు. దీనితో బీసీసీఐ తన వైపు ఆకర్షితమయ్యింది.
అప్పటి కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియడంతో, అందరూ అనుకున్నట్టే భారత కోచ్ పగ్గాలను చేపట్టారు గంభీర్. అయితే అప్పటికే టీ-20 వరల్డ్ కప్ లో విశ్వ విజేతలుగా నిలిచిన భారత జట్టు అగ్ర స్థానంలో ఉంది. అలాగే అటు టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్ లో కూడా తన అగ్ర స్థానాన్ని కొనసాగిస్తుంది.
Also Read – సంక్రాంతికి సినిమాలు… తర్వాత ఐటి రెయిడ్స్?
దీనితో ఇక ఎలాగో WTC పక్కా అనుకున్న భారత అభిమానుల ఆనందాలు ఎన్నో నెలలు నిలువలేదు. గంభీర్ కోచ్ గా మారిన తొలి వన్-డే సిరీస్ లోనే భారత్ శ్రీలంక పై ఘోర ఓటమిని ఎదుర్కొంది. ఎప్పుడు లేని విధంగా గత 27 ఏళ్లలో మొదటిసారి శ్రీలంక తో వన్ డే సిరీస్ ను కోల్పోయింది టీం ఇండియా.
ఈ ఓటమి తో ఆటలో గెలుపోటములు సర్వ సహజంలే అని సరిపెట్టుకున్న భారత అభిమానులకు మరో ఊహించని షాక్ ఇచ్చింది టీం ఇండియా. 36 ఏళ్ళ తరువాత తమ హోమ్ గ్రౌండ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని చవిచూసిన భారత జట్టు ఆ సిరీస్ ను వైట్ వాష్ తో ముగించారు.
Also Read – వారసత్వంగా ఆస్తులే వస్తాయి.. పదవులు కావు!
ఇక ఆ తరువాత ఆడిన బీ.జీ.టీ లో సైతం కేవలం ఒక్క మ్యాచ్ లోనే మెరుగైన ప్రదర్శన కనపరిచిన భారత్ సుమారు 10 ఏళ్ళ తరువాత బీ.జీ.టీ ను చేజార్చుకుంది. ఇక, టెస్ట్ ఫైనల్ పక్కా అనుకున్న స్థాయి నుండి ఆ ఫైనల్స్ నుండి ఓటమి భారంతో నిష్క్రమించబడిన స్థాయికి వచ్చేసింది భారత జట్టు.
అయితే ఈ వరుస అపజయాలన్ని కూడా గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో జరగడంతో అసలు జట్టులో ఏం జరుగుతుంది? కౌచ్ గా గౌతమ్ ఏం సమాధానం చెపుతారు? టీంలో ఒక్కసారిగా వచ్చిన ఇంత మార్పు వెనుక గంభీర్-రోహిత్ ల మధ్య సఖ్యత లేకపోవటమా? లేదా తాను చెప్పిందే జరగాలి అని గంభీర్ అనుకుంటున్నారా? అంటూ సోషల్ మీడియాలో గౌతమ్ పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.
Also Read – పాన్ ఇండియా స్థాయిలో వర్మ పాపాల పొద్దు..!
గౌతమ్ కోచ్ గా ఎంట్రీ ఇవ్వకముందు జట్టు ఎలా ఉండేది? ఇప్పుడు ఇలా ఉంది? అసలు టీం ఇండియా గేమ్ ను ఛేంజ్ చేసింది ఎవరు.? అంటూ గంభీర్ కోచింగ్ సరళి మీద కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
దీనితో వరుస ఓటములతో జట్టు ఆటగాళ్ల పై తీవ్ర ఒత్తిడి ఎదురవ్వడం ఆ ఒత్తిడిని తట్టుకోలేక వారు పెవిలియన్ బాట పట్టడం ఇప్పుడు టీం ఇండియాలో అరుదుగా కనిపిస్తున్న దృశ్యమైపోయింది. మరి కొత్త ఏడాదిలో అయినా ఈ ఓటమి భారాన్ని వదిలి తిరిగి గంభీర్ ఆధ్వర్యంలో టీం ఇండియా సక్సెస్ ను చూడగలదా..? సీనియర్స్ తమ సత్తా చూపగలరా.?