కప్పు యాత్రకు రంగం సిద్ధమా.?

India: The World Cup, The Farewell & The Future

ఇటీవలే ముగిసిన టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ ను 7 రన్స్ తేడాతో కైవసం చేసుకుంది టీం ఇండియా. మళ్ళీ తిరిగి 11 ఏళ్ళ తరువాత ఒక ఐసీసీ ట్రోఫీ ను ముద్దాడింది భారత జట్టు. అయితే 17 ఏళ్ళ తరువాత మరల టీ-20 వరల్డ్ కప్ ను అందుకుంది.

ADVERTISEMENT

జూన్ 29 న బార్బొడాస్ లో ముగిసిన ఫైనల్స్ గెలిచిన టీం ఇండియా తిరిగి సొంత గడ్డ మీద అడుగు పెట్టలేదు. అక్కడ దారుణమైన వాతవరణ పరిస్థుతుల వల్ల ఆ దేశం నుండి వెళ్లే అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. అందుకే భారత జట్టు ఇంకా ఇండియా కు తిరిగి రాలేదు.

అయితే వారి రాకకు మరి కొన్ని గంటలు ఉన్న సమయంలో, సోషల్ మీడియా లో ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. జట్టు తిరిగి భారత గడ్డ మీద అడుగుపెట్టగానే తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి, వెంటనే ముంబై లో ఒక ఓపెన్ బస్సు టూర్ లో పాల్గొనబోతున్నారు అంటూ పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా, 17 ఏళ్ళ కిందట ఎం.ఎస్.ధోని సారధ్యం లో సౌత్ ఆఫ్రికా లో జరిగిన మొట్ట మొదటి టి-20 వరల్డ్ కప్ ను చేజిక్కిచ్చుకోగానే, అప్పటి జట్టు సభ్యులు అంత ఈ మాదిరి గానే ఒక ఓపెన్ బస్సు టూర్ ను చేసి, ఫాన్స్ అందరికి కన్నుల విందు కలిగేలా ఆ వరల్డ్ కప్ ను ముంబై నగర రోడ్ల పై తిప్పారు. ఆ దృశ్యాలు ఇంకా ఏ సగటు భారత అభిమాని మరువలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

అంత అనుకున్నట్టే అయితే, మళ్ళీ తిరిగి 17 ఏళ్ళ తరువాత రోహిత్ శర్మ నేతృత్వం లో సౌత్ ఆఫ్రికా పై గెలిచి, వరల్డ్ కప్ ను మరల ముంబై నగర వీధుల్లో తిప్పే అవకాశాలు లేకపోలేవు. గడిచిన 12 నెలలలో రెండు సార్లు ఫైనల్స్ కు వెళ్లిన భారత్, రెండింటిలోనూ ఓడి, కెప్టెన్ రోహిత్ కు నిరాశే మిగిల్చింది. అయితే కప్పు తీసుకుని రిటైర్మెంట్ తీసుకోవాలి అనే రోహిత్ కల నెరవేరడంతో…కప్పుతో టీం ఇండియా విజయ యాత్ర చూడాలనుకున్న క్రికెట్ అభిమానుల కల నెరవేరుతుందా.?

ADVERTISEMENT
Latest Stories