Teenmaar Mallanna Congress Controversy

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రక్రియను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏకంగా పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు.

Also Read – రాహుల్ “లీగల్లీ కన్వెర్టడ్ ఇండియన్”.?

అయితే కాంగ్రెస్ పార్టీ ఇంత కీలకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ పై టి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కులగణన ఫామ్ కు నిప్పటించారు. దీనితో రాష్ట్ర అధిష్టానం తీన్మార్ తీరు మీద క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే మల్లన్న చర్యల మీద పార్టీలో ఇప్పటికే ప్రతిచర్య మొదలయ్యిందనే చెప్పాలి. మంత్రి సీతక్క తీన్మార్ రాజకీయాల మీద మండిపడుతూ ఆయన పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయితే ప్రభుత్వ పెద్దలు, సొంత పార్టీ నేతలు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం మీద మండిపడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మీద మరోసారి రెచ్చిపోయారు మల్లన్న.

Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?

కాంగ్రెస్ పార్టీ మీ అయ్యా జాగీరా.? కాంగ్రెస్ పార్టీ మా బీసీల పార్టీ, ఆ పార్టీని వాడుకుంటూ మీరు పెత్తనం చేసుకుంటున్నారు. ఇక నుంచి ఇది నడవదు, ఇలా బెదిరించడాలు, దమ్కీలు ఇవ్వడాలు చేస్తే ఎట్టి పరిస్థితులలో బీసీలు ఉరుకునేదే లేదు. బీసీ లకు అన్యాయం జరిగితే పండబెట్టి తొక్కుతారు అర్ధమవుతుందా.?

ఇది సమగ్ర కుల సర్వే కాదు అగ్రకుల సర్వే, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆడిన డ్రామానే ఈ కులగణన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రెచ్చిపోయారు తీన్మార్ మల్లన్న. అయితే గత కొన్ని రోజులుగా మల్లన్న రాజకీయాలను గమనిస్తే ఆయన తెలంగాణలో బీసీ కుల నాయకుడిగా వ్యక్తిగతంగా ఎదగడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అనేది సుస్పష్టం.

Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?


అలాగే ఒక పక్క కులగణన ను విమర్శిస్తూనే మరోపక్క తెలంగాణలో కుల రాజకీయాలకు పునాదు వేస్తున్నారు తీన్మార్. అయితే సొంత పార్టీ నేతల నుండే ఈ స్థాయి విమర్శలు ప్రభుత్వానికి ఎదురయితే ఇక ప్రతిపక్షాల నోటికి కాంగ్రెస్ నేతలు తాళం వెయ్యగలరా.? మొక్కై వంగనిదే మానై వంగుతుందా అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలను కులం పేరుతో కలుషితం చెయ్యాలని చూస్తున్న తీన్మార్ రాజకీయాలకు చెక్ పెట్టకపోతే నాయకులో, పార్టీలో కాదు తెలంగాణ సమాజం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.