kcr-revanth-reddy-telangana-assembly

ఏపీతో పోలిస్తే తెలంగాణ రాజకీయాలలో కుల ప్రభావం తక్కువే. కానీ ఏపీలో రాజకీయ పార్టీలు కులాలను ఉపయోగించుకొని ఏవిదంగా ప్రయోజనం పొందుతున్నాయో గమనించిన కేసీఆర్‌, తెలంగాణలో కూడా కులాలవారీగా పధకాలు, ప్రయోజనాలు అందిస్తూ కుల రాజకీయాలకు పునాది వేశారు.

Also Read – అందరికీ సారీ.. అదిదా సర్‌ప్రీజు!

తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి కూడా కుల గణన సర్వే చేయించి, ఎస్సీ, ఎస్టీ, బీసీలతో గేమ్ మొదలుపెట్టారు. అయితే ఆ ప్రయత్నం బెడిసి కొట్టడంతో తాజాగా బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి తెచ్చారు.

విద్య, ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్స్ 42 శాతం పెంచేందుకు ముసాయిదా బిల్లుని మంత్రివర్గ సమావేశం ఆమోదించారు. త్వరలో దానిని శాసనసభలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని కాంగ్రెస్‌ మంత్రులు చెప్పారు.

Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!

గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్స్ అంటూ ఇలాగే శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పోస్టు డబ్బాలో పడేశారు.

ఆ ముసాయిదా బిల్లు రూపొందిస్తున్నప్పుడే దానిని కేంద్రం ఆమోదించదని కేసీఆర్‌కి బాగా తెలుసు. కానీ దాని కోసం శాసనసభలో తీర్మానం చేసి పోస్టు బాక్సులో పడేసి ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నమ్మించి వారి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు.

Also Read – కొత్త జట్టుకు పాత గుర్తులు ఇవ్వగలడా..?

తర్వాత బీసీలని ప్రసన్నం చేసుకుని వారి ఓట్లు దండుకునేందుకు వారికి రిజర్వేషన్స్ 37 శాతం పెంచుతూ శాసనసభలో మరో తీర్మానం చేసి పోస్టు బాక్సులో వేసి చేతులు దులుపుకున్నారు. షరా మామూలుగా దానిని చూపించి బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నమ్మించి వారి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు.

నేటికీ ఆ తీర్మానం అక్కడే పడుంది. దానికి మోక్షం కలిగే అవకాశం కూడా లేదు. ఎందువల్ల అంటే అన్ని వర్గాలు, అన్ని రకాల రిజర్వేషన్స్ కలిపి 50 శాతానికి మించకూడదని రాజ్యాంగం చెపుతోంది కనుక!

ఆ 50 శాతం దాటకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలంటే మిగిలిన వర్గాలకు తగ్గించాలి. లేదా రాజ్యాంగ సవరణ చేసి ఆ 50 శాతం పరిమితిని ఇంకా పెంచడమో లేదా పూర్తిగా తొలగించేయవలసి ఉంటుంది. ఈ రెండు సాధ్యం కావని అర్దమవుతూనే ఉంది.




అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కేటాయిస్తూ ముసాయిదా బిల్లు ఆమోదించేసింది. బీసీ రిజర్వేషన్స్ 37 శాతం పెంచుతూ గతంలో పంపిన ప్రతిపాదనని కేంద్రం అప్పుడే చెత్తబుట్టలో పడేసింది. ఇప్పుడు దానిని వెనక్కు తీసుకొని 42 శాతం తీర్మానం చేసి పంపుతామని కాంగ్రెస్‌ మంత్రులు చెపుతుండటాన్ని ఏమనుకోవాలి? రేపు శాసనసభలో బీసీల రిజర్వేషన్స్ 42 శాతమని తీర్మానం చేసి, దానిని పోస్టు బాక్సులో వేస్తారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.