రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార మార్పిడి జరగడంతో దూరమైన అధికారానికి దగ్గర కావడానికి ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్, వైసీపీ అధికార పార్టీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నాయి.
Also Read – పవన్ ఇచ్చేశారు… జగన్ పుచ్చుకుంటున్నారు!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు నెలలు కూడా పూర్తవ్వకుండానే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ దేశ రాజధాని ఢిల్లీ దాక వెళ్లి నిరసన తెలియచేసి నవ్వులపాలయ్యారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.
అయితే పొరుగు రాష్ట్ర మిత్రపక్షమైన వైసీపీ ఢిల్లీ దాక వెళితే మేమెందుకు వెళ్ళకూడదు అనుకున్నారో ఏమో కానీ బిఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణలో త్వరలో ఉపఎన్నికలు రావడం తధ్యం అంటూ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
Also Read – తెలీని విషయాలు మాట్లాడి నవ్వులపాలవడం దేనికి?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఈరోజో రేపో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, తిరిగి బిఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది అంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మిషన్ ఆకర్ష మొదలుపెట్టి బిఆర్ఎస్ పార్టీ నేతలను హస్తం గూటికి చేర్చుకున్నారు.
దీనితో కొంత కాలం ఈ ఎదురుదాడికి ఫుల్ స్టాప్ పెట్టిన బిఆర్ఎస్ తిరిగి ఉప ఎన్నికల వ్యూహం ఎత్తుకుంది. పార్టీ మారిన నేతలందరి మీద అనర్హత వేటు వేయడానికి అవసరమైన న్యాయపరమైనా చర్యల పై రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ నాయకులు సమావేశమయ్యి చర్చలు జరుపుతారంటూ ప్రకటించారు.
Also Read – కేసీఆర్ ఊసుపోక యాగాలు చేయలేదు స్మీ!
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బిఆర్ఎస్ నేతల పై బిఆర్ఎస్ పార్టీ తరుపున త్వరలో సుప్రీం కోర్టులో కేసు వేసి ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామంటూ హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి కొద్దికాలమే అయినప్పటికీ బిఆర్ఎస్, వైసీపీ లు అధికార పార్టీని కూల్చడానికి ప్రయత్నాలు విరమించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.