కేసీఆర్ దూకుడు చంద్రబాబుకు చేటు చేస్తుందా?

Telangana CM KCR against BJP Congressతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మొన్నామధ్య కేంద్రంపై గర్జించారు. రాష్ట్రాల అవసరాలు ఢిల్లీలో కూర్చున్న మీకేంతెలుస్తాయి? కేంద్రం విదేశీ సంబంధాలకు, సరిహద్దుల రక్షణకు, జాతీయ రహదారుల నిర్వహణకు మాత్రమే కట్టుబడి ఉండాలని దాని కోసం కొత్తగా ఒక కాంగ్రెస్ బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించారు.

ADVERTISEMENT

ఫ్రంట్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలీదుగానీ కేసీఆర్ దూకుడుకు మాత్రం సామాన్యుడు ఫిదా అయ్యాడు. మరోవైపు దీనిలో భాగంగా ఢిల్లీలో ధర్నా చెయ్యాలని ఆయన సంకల్పిస్తున్నారట. రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాలతో తొలిపోరు చేపట్టాలని.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారట.

జంతర్‌మంతర్‌ వద్ద చేసే ఈ ధర్నాకు రాష్ట్ర మంత్రులతో పాటు అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించాలని యోచిస్తున్నారని కధనం. మరోవైపు కేంద్రంతో సఖ్యత, వేచిచూడటం వంటి ధోరణితో ఈ విషయంలో చంద్రబాబు కాస్త వెనుకబడిపోయినట్టే కనిపిస్తున్నారు.

సహజంగా తెలుగు ప్రజలు తమ నాయకుడు ఇలా దూకుడుగా ఉండాలని కోరుకుంటారు. అయితే రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబుకు అది కుదరదు. అయితే కేసీఆర్ ఆలా ఉండటం చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచుతుంది. అది కాక కేసులకు బయపడి చంద్రబాబు వెనుకడుగు వేస్తున్నారు అందుకే మంత్రులను ఉపసంహరించినా ఎన్డీఏ నుండి బయటకు రాలేదు అంటూ ప్రచారం చేసే ప్రతిపక్షం ఉండనే ఉంది. వచ్చి 2-3 నెలలో చంద్రబాబు వేసే అడుగులు బట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఉండబోతుంది.

ADVERTISEMENT
Latest Stories