
దావోస్ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.1.79 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వాటిలో అమెజాన్ వెబ్ సర్వీసస్, సన్ పెట్రోకెమికల్స్, జెఎస్‌డబ్ల్యూ వంటి పేరుమోసిన కంపెనీలు చాలానే ఉన్నాయి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వచ్చేవి.
ఆ సమయంలో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి ఉన్న జగన్ అమరావతి నిర్మించకుండా మూడు రాజధానులు పిట్ట కధలతో రాక్షస పాలన చేస్తుండటం కూడా తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు.
Also Read – జగన్ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!
కానీ ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం పనులు మొదలుపెట్టారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది. మరోపక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో భ్రష్టుపట్టిపోతోందని కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలు వాదిస్తున్నారు.
ఈ నేపధ్యంలో సిఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ సదస్సు నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించడం చూసి బిఆర్ఎస్ పార్టీ నేతలకు కడుపు మండిపోవడం సహజం. కనుక రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత విమర్శలు చేస్తున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ వారికి అర్దమయ్యే భాషలోనే ఘాటుగా సమాధానం చెప్పింది.
Also Read – గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టూ ‘తాడేపల్లి ఫైల్స్’..!
బిఆర్ఎస్ పార్టీ విమర్శలకు బదులుగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో పెద్ద పెద్ద ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టింది. వాటిలో ఓ పక్క కేసీఆర్ కడుపు పట్టుకొని ఉన్న బొమ్మ దాని కింద “డైజెస్ట్ ది గ్రోత్” అని క్యాప్షన్ ఇచ్చారు.
బ్యానర్ మరో పక్క రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు అని వేసి మద్యలో “పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ఇనో.. ఇనో ఆన్ కడుపు మంట గాన్” అంటూ ఇనో ప్రకటనని తెలివిగా వాడుకున్నారు.
Also Read – విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?
గతంలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ ఇదేవిదంగా ఆయనని ఎద్దేవా చేస్తూ నగరంలో ఫ్లెక్సీ బ్యానర్స్ పెట్టించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్దతిలో కేసీఆర్‌కి జవాబు చెప్పింది. బాగుంది కదా?