ప్రజలే నా ధైర్యం…, పోరాటమే నా ఊపిరి..,రేవంత్.!

Revanth-Reddy Telangana Congress Party Presidentతెలంగాణాలో రాజకీయ పార్టీలన్నీ ‘పోరుబాట’ పట్టాయి. కేంద్రం మీద ‘వరి’ కొనుగోళ్ల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తెరాస నాయకులతో నిరసన దీక్షలకు పిలుపునివ్వగా…,కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పెరిగిన ‘విద్యుత్., పెట్రోల్.,గ్యాస్’ ధరలను వెంటనే తగ్గించాలంటూ హైద్రాబాద్ లోని విద్యుత్ సౌధ,సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి పిలుపునిచ్చింది.

టి.కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ ప్రభుత్వం మీద దూకుడుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల గృహ నిర్బంధాన్ని ఛేదించుకుని రేవంత్ నిరసన దీక్షలో పాల్గోని కార్యకర్తలలో నమ్మకాన్ని.,ప్రజలలో భరోసాని నింపారు. తనను ఆంక్షలతో ఎవ్వరు కట్టడి చేయలేరని ప్రభుత్వానికి గట్టిగానే బదులిచ్చారు.

ADVERTISEMENT

“ప్రజలే నా ధైర్యం.., పోరాటమే నా ఊపిరి” అనే నినాదంతో ప్రభుత్వ వైఖరిపై రేవంత్ మండిపడ్డారు. ఇలా ప్రజలకు నిత్యవసరాలైనా విద్యుత్ – గ్యాస్ – పెట్రోల్ -డీజిల్., రేట్లను పెంచుకుంటూ పొతే పేద.., మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. కేంద్రంలో మోదీ.., రాష్ట్రంలో ఈ కేడి ధరలను పోటీపడి మరి పెంచుతూ ప్రజలను లూటీ చేస్తున్నారన్నారు.

తెరాస ప్రభుత్వం మిగులు బడ్జెట్ లో ప్రారంభమైన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అప్పుల బాట పట్టించిందని.,కెసీఆర్ తన విధానాలతో రాష్ట్రాన్నే కాదు., రాష్ట్ర ప్రజలను అప్పుల పాలు చేస్తున్నారని., ఈ ప్రభుత్వాల నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలంటూ రేవంత్ ప్రజలకు పిలునిచ్చారు.ఆందోళనలు ఉదృతం కావడంతో అప్రమత్తమైన పోలీస్ బాసులు రేవంత్ తో సహా మిగిలిన టి.కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ADVERTISEMENT
Latest Stories