ఒక ఇంట్లో సమస్యలు ఏర్పడితే ఇంటి యజమాని లేదా కుటుంబ సభ్యులు పరిష్కరించుకుంటారు. ఒక రాజకీయ పార్టీలో సమస్య ఏర్పడితే పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తుంది. కానీ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు సమస్యలు ఏర్పడితే ప్రభుత్వాలు వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నయా? అంటే లేదనే చెప్పాలి.
కనుక సమస్యలు భరించ గలిగినంత వరకు ఓపిక పట్టి తర్వాత ప్రజలు కూడా రోడ్లపైకి వస్తుంటారు. ప్రజలు రోడ్లెక్కే వరకు తమ వారి సమస్యలు పరిష్కారం కాకపోవడం భాదాకరమే కాదు బాధ్యతారాహిత్యం కూడా!
ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న మరో అవుటర్ రింగ్ రోడ్ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసర గ్రామాలలో భూసేకరణ జరుగుతోంది.
ఇది వరకు కేసీఆర్ హయంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు కూడా కొండ దిగువన చుట్టుపక్కల ప్రాంతాలలో భారీగా భూసేకరణ చేశారు. అప్పుడే చాలా నష్టపోయామని, ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చేస్తే ఉన్న భూమి అంతా పోయి రోడ్డున పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ ఓఆర్‌ఆర్‌ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో, రైతులకు ఎక్కడా అన్యాయం జరగదని హామీ ఇస్తూ భూసేకరణ చేస్తోంది.
దీంతో రైతులు ప్రభుత్వానికి తమ సమస్య తీవ్రత, నిరసన తెలియజేసేందుకు త్వరలో జరుగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నామినేషన్స్ వేయబోతున్నారు. ఇదివరకు నిజామాబాద్ పసుపు రైతులు కూడా ఇలాగే చేసి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితని ఓడించారు.
పొలం, పంటలు, వ్యయసాయం తప్ప మరేమీ తెలియని సామాన్య రైతులు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం వారి సమస్య తీవ్రతని ప్రభుత్వం అర్ధం చేసుకోకపోవడం చేసుకున్నా న్యాయం చేయకపోవడమేనని అర్ధమవుతోంది.
రాజకీయ పార్టీలలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించుకుంటున్నప్పుడు, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించకపోయినా కనీసం ఎందుకు స్పందించడం లేదు?ప్రజలు, రైతులు ఈవిదంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి, ఎన్నికలలో ఓడగోడితే తప్ప ప్రభుత్వాలు స్పందించవా?
అక్కడకు చేరుకునేందుకు విశాలమైన పలువురు రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడ్డారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ కోసం తమ భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని రైతులు అంటున్నారు.




