తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగానైనా మేల్కొంది

KCR-Cut-Off-With-Ground--Realityకరోనా కట్టడి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది అంటూ తెలంగాణ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్లక్ష్యం, ప్రైవేటు దోపిడి అడ్డుకోవడంలో వైఫల్యం వెరసి పార్టీ సమర్ధకులు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఉచిత వైద్యానికి రాష్ట్ర వ్యాప్తంగా 20 మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల నియంత్రణకు త్వరలో వాట్సాప్ నెంబర్ తీసుకువస్తున్నట్లు ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు. బాధితులు ఆ నెంబర్‌కు పిర్యాదులు చేయవచ్చునని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ADVERTISEMENT

రాబోయే రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న ట్రీట్‌మెంట్‌పై పర్యవేక్షణ జరుపుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిపై లోడ్ తగ్గించేందుకు అన్ని జిల్లా ప్రభుత్వం ఆసుపత్రులలో కరోనా ట్రీట్మెంట్ కు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ చర్యలతో ప్రజల ఇక్కట్లు కొంచమైనా తీరుతాయేమో చూడాలి.

ఇది ఇలా ఉండగా…. నిన్న రాత్రి విడుదలైన మెడికల్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో మొత్తం కేసులు 37,745కు చేరాయి. దాదాపుగా 75% కేసులు రాజధాని ప్రాంతంలోనివే. ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 375 మంది ప్రాణాలు కోల్పోయారు.

ADVERTISEMENT
Latest Stories