తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఘటనలు… మండలి చైర్మన్‌ కంటికి స్వల్ప గాయం

Telangana Legislative council chairman Swamy Goud suffer injuriesతెలంగాణ బడ్జెట్ సమావేశాల మొదటి రోజునే తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో విపక్ష కాంగ్రెస్‌ సభ్యుల్లో కొందరు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. బడ్జెట్‌ ప్రతులను చించి, గవర్నర్‌పైకి విసిరేశారు కొందరు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌సెట్‌ విసరేయడంతో మండలి చైర్మన్‌కు గాయమైంది.

వెంటనే ఆయనను సరోజనినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు వార్తలు వెలువడ్డాయి. కోమటిరెడ్డి హెడ్‌ సెట్‌ విసిరేసిన దృశ్యాలు అసెంబ్లీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఆయన తనపై మార్షల్స్ చెయ్యి చేసుకున్నారని తన కాలికి గాయం అయ్యిందని రివర్స్ లో కంప్లయింట్ చేసారు.

ADVERTISEMENT

పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రతిరోజూ స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళుతున్నారుకదా, మరి ఇక్కడ మాత్రం నిర్బంధాలు ఎందుకు?’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగిలితే తీవ్ర పరిణామాలు తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదివరకే హెచ్చరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వారిపై గట్టి చర్యలు తీసుకోబోతున్నారని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories