
పౌరులకు దేశభక్తి ఎంత సహాజమో ప్రతీ రాష్ట్రంలో ప్రజలు తమ రాష్ట్రాన్ని, భాషని, సంస్కృతీ సంప్రాదాయాలను ప్రేమించడం అంతే సహజం. అది అవసరం కూడా. కానీ బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రేమని ఓ బలమైన ‘నెగెటివ్ శక్తి’గా మార్చి, అవసరమైనప్పుడల్లా తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ఆయుధంగా వాడుకుంటూనే ఉంది. అది ఎన్నికలప్పుడు కావచ్చు లేదా బిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కావచ్చు ఏ సందర్భానికైనా దానికి ఇదే అస్త్రం.
ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క కేసీఆర్ మెడకి కూడా కేసుల ఉచ్చు బిగుసుకుంటున్నట్లే ఉంది. ఈ కేసుల భయంతోనే పార్టీలో సీనియర్లు అందరూ సైలంట్ అయిపోయారు.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
బిఆర్ఎస్ పార్టీకి కష్టం వచ్చింది. కనుక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఆయుధాన్ని బయటకు తీయకతప్పలేదు. తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలంటే, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని, ఆంధ్రప్రదేశ్‌ని బూచిగా చూపించాలి. చంద్రబాబు నాయుడుతో సిఎం రేవంత్ రెడ్డిని ముడిపెట్టి ఇద్దరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారని, కనుక తెలంగాణ రాష్ట్రం చాలా ప్రమాదంలో ఉందని ప్రజలను నమ్మించాలి. బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే చేస్తోంది.
ఏపీలో కరువు ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలకు త్రాగుసాగు నీరు అందించేందుకు నదుల అనుసంధానం చేయడానికి తోడ్పాటు అందించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దానిలో భాగంగా ఏటా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి వరద జలాలను బనకచర్ల లింకు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?
పోలవరం కుడి కాలువపైగా తాడిపూడి లిఫ్ట్ ద్వారా గోదావరి జాలలను ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి మళ్ళీ ఆరు దశలలో నీటిని లిఫ్ట్ చేస్తూ బొల్లపల్లిలో 150 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించే రిజర్వాయర్‌కి తరలించాలని తిపాదించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి రాయలసీమ జిల్లాలకు నీటిని అందించాలని ప్రతిపాదించింది.
మూడు దశలలో చేపపట్టాలనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.80,112 కోట్లు. కేంద్రం నదుల అనుసంధానం చేసి దేశంలో అన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు త్రాగు, సాగునీరు అందించాలని భావిస్తోంది కనుక ఈ లింకు ప్రాజెక్టు అవసరమైన పర్యావరణ, సాంకేతిక ఇతర అనుమతులు మంజూరు చేసి నిధులు అందించి తోడ్పడాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.
Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?
దీనినే బిఆర్ఎస్ పార్టీ దాని సొంత మీడియా బూచిగా చూపిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు దోచేయాలని పెద్ద కుట్రలు చేస్తున్నారు. ఆయనకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారంటూ, “నీటి కుట్రలు మళ్లీ మొదలు.. వరద మాటున గారడీ.. ఏపీ జల దోపిడీ” పేరుతో ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించింది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇమ్మనమని సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీని అడిగితే ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15,000 కోట్లు అప్పు ఇప్పించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణం దశాబ్ధాలుగా సాగుతూనే ఉంది. దాని పరిస్థితి మూడడుగులు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది.
కేంద్రం పోలవరానికే అరకొర నిధులు విడుదల చేస్తుంటుంది. అటువంటప్పుడు ఓ 10-15 ఏళ్ళు సమయం పట్టే ఈ లింకు ప్రాజెక్టుకి కేంద్రం రూ.80,111 కోట్లు ఇచ్చేస్తుందా?అంటే కాదనే అర్దమవుతోంది.
ఈ ప్రాజెక్ట్ అనుమతులు సాధించేందుకే కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది. ఈ విషయం, సిఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీకీ బాగా తెలుసు. అందుకే ఈ లింకు ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరుగుతుందా లేదా? జరిగేమాటైతే ఏ మేరకు ఉంటుంది? అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
అయినా ఏపీని, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలని బూచిగా చూపిస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తనవైపు తిప్పుకోవాలని దురాలోచన చేస్తోంది. బిఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం రెండు రాష్ట్రాల ప్రజల మద్య చిచ్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పులు తెచ్చి దేశాన్ని ఉద్దరిస్తానని గొప్పగా చెప్పుకున్న బిఆర్ఎస్ పార్టీలో ఈ ప్రాంతీయతత్వం మారలేదని స్పష్టమవుతోంది.