తెలంగాణలో కాంగ్రెస్,టిడిపి ల మధ్య సీట్ల పంపిణీ ముందుకు కదలడం లేదు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి అదినేత జోక్యం చేసుకుంటే కాని తెగేలా లేదని సమాచారం. తెలుగుదేశం పార్టీ గతసారి 15 సీట్లు గెలిచింది.అలాగే పదహారు సీట్లలో రెండో స్థానంలో వచ్చింది. అందువల్ల 31 సీట్లను ఇవ్వాలని టిడిపి కోరుతోంది.
[m9ad]
కాని కాంగ్రెస్ అందుకు సిద్దంగా లేదు. పన్నెండు సీట్లు ఇవ్వడానికి సిద్దంగా ఉంది. లేదంటే మహా అయితే పదిహేను వరకు ఇవ్వవచ్చని అంటున్నారు. అలాగే సిపిఐ ఏడు సీట్లు కోరుతోంది. జనసేన కూడా ముప్పై సీట్ల వరకు డిమాండ్ పెట్టినా, వీరందరికి కలిపి 29 సీట్లు ఇచ్చి ,నికరంగా 90 సీట్లలో పోటీచేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశంగా ఉంది.
అయితే కూటమిలోని పార్టీలకు ఇచ్చే ఇరవైతొమ్మిది సీట్లలో పాతబస్తీలో ఎమ్.ఐ.ఎమ్ బలంగా ఉండే సీట్లు కూడా ఏడెనిమిది ఉండడం విశేషం. దీనితో మిగతా పార్టీల ఒకింత అసహనంగా ఉన్నాయట. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని పొత్తు గానీ ఎక్కువ సీట్లు వారికి కేటాయిస్తే మొదటికే మోసం రావొచ్చు అని కాంగ్రెస్ భావిస్తోందట.



