
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అంశంతో రాజకీయాలు జరుగుతుంటాయి. ఏపీలో కుల సమీకరణలు, పొరుగు రాష్ట్రంలో ఆంధ్రా బూచి-తెలంగాణ సెంటిమెంట్, జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాదం, తమిళనాడులో హిందీ భాష ఇలా ఒక్కో రాష్ట్రానికి కొన్ని బేసిక్ అంశాలు ఉంటాయి.
Also Read – ఒకరిది భాషోద్వేగం..మరొకరిది ప్రాంతీయవాదం..మరి ఏపీ.?
తమిళనాడు రాజకీయ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంపై హిందీ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తే సహించబోమని ఇటీవలే సిఎం స్టాలిన్ హెచ్చరించారు. తమిళనాడులో మొదట తమిళం తర్వాత ఆంగ్లం తప్ప హిందీ అవసరం లేదన్నట్లు మాట్లాడారు.
తమిళనాడులో ఆ సెంటిమెంట్ మెయిన్‌టైన్ చేయడం చాలా అవసరం కనుక ఆయన అలా మాట్లాడక తప్పలేదని సమర్ధించుకున్నా, రాజకీయాల కోసం హిందీ వద్దనుకున్నందుకు దేశంలో వేరే రాష్ట్రాలకు వెళ్తే తమిళులే ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు.
Also Read – అయ్యో! మన హిస్టరీ అంతా అలా చెప్పేస్తున్నారేమిటి?
కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు కూడా హిందీ భాష పట్ల చిన్న చూపు చూపవు. అందువల్లే రెండు తెలుగు రాష్ట్రాలలో హిందీ వినబడుతుంటుంది. హిందీని మనం గౌరవించినంత మాత్రాన్న తెలుగుని ఉత్తరాదివారు గౌరవిస్తారనుకోలేము.
కానీ మన తెలుగు భాషకు అటువంటి అపూర్వమైన గౌరవం మహా కుంభమేళలో లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం అన్ని ప్రధాన రహదారులపై ప్రయాగ్‌రాజ్‌కు దారి సూచించే సైన్ బోర్డులపై హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషలో కూడా వ్రాశారు. అది చూసి తెలుగు ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఇది తెలుగు భాషకి దక్కిన గౌరవమే కదా?