ఎస్ఎస్ థమన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హాట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ గానీ మ్యూజిక్ గానీ థమన్ మనసు పెట్టి చేస్తే… చార్ట్ బస్టర్ గ్యారంటీ అని నిర్మాతల నమ్మకం. ఏ టైం లో చూసినా సూపర్ బిజీ గా ఉండే థమన్ మీద ఈ మధ్య తరచుగా అందుబాటులో ఉండటం లేదని వార్తల్లో నిలుస్తున్నాడు.
ఎక్కువ సినిమాలు కదా అందరినీ ఎకొమొడేట్ చెయ్యడంలో ఇబ్బందులు అనుకుంటే పొరపాటే… థమన్ కి ఫోకస్ తగ్గింది అంటూ వార్తలు వస్తున్నాయి. పెద్ద సినిమాలకు ప్రిఫెరెన్స్ ఇస్తూ మిగితావాళ్లను ఇబ్బంది పెడుతున్నాడా అంటే అదీ లేదు… అందరికీ సమన్యాయమే… అందరికీ ఇబ్బందే.
Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!
దసరాకు విడుదలయ్యే ఒక పెద్ద సినిమా కు ఇప్పటిదాకా రెడీ చేసింది ఒక పాటే.
అది పక్కన పెడితే థమన్ కారణంగా నిర్మాతలకు ఇతర ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయట.
Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?
థమన్ స్టూడియో సెట్ అప్ అంతా బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ లోనే అట. ఒక సూట్ రూమ్ సహా కొన్ని రూంలు ఎప్పుడూ థమన్ పేరు మీదే. ఇటీవలే ఒక నిర్మాతకు ఏకంగా 40 లక్షల హోటల్ బిల్ వెళ్లిందట.
అయితే ఇక్కడో సమస్య ఉంది. థమన్ ఎప్పుడూ పలు సినిమాల మీద వర్క్ చేస్తూ ఉంటాడు. మరి బిల్లుల మాట ఏమిటి? ఎవరు భరించాలి?
Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?
ఆ విషయం నిర్మాతలకు కూడా తెలీదు… థమన్ ఎవరికి బిల్ పంపితే వారు కట్టాల్సిందే.
ఆప్షన్స్ లేని ఇండస్ట్రీ… మనకు ఇంతే ప్రాప్తం అని కట్టేస్తున్నారట.