‘శివ’ సినిమాతో వెండి తెరమీద ఒక హీరోను స్టార్ ను చేసి ఒక కమర్షియల్ డైరెక్టరుకు క్రేజ్ ను సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ సినీ ప్రస్థానం క్రీస్తు ముందు క్రీస్తు తరువాత అన్నట్లు వైసీపీ కి ముందు వైసీపీ కి తరువాత అనే విధంగా సాగింది.
ఒకప్పుడు క్షణక్షణం, గోవిందా గోవిందా, గాయం, సత్య, రంగోలి వంటి సినిమాలు తీసి టెక్నికల్ డైరెక్టరుగా ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలు దాచుకున్న వర్మ, ఆ తరువాత హార్రర్ మూవీస్ తో ప్రేక్షకులను థియేటర్లలో భయపెట్టాలని చూస్తే వాటిలో కొన్ని విజయం దిశగా వెళితే మరికొన్ని సినిమా తీసిన నిర్మాతను భయపెట్టాయి.
Also Read – జయభేరీకి హైడ్రా నోటీస్… నో వర్రీస్ మేము రెడీ
ఇక రామ్ గోపాల్ వర్మ శకం ముగిసింది అనే స్థాయికి వచ్చాక బూతు సినిమాలు తీసుకుంటూ చేతిలో గ్లాస్, చుట్టూ అమ్మాయిలను పెట్టుకుని సమాజానికి ఒక వ్యక్తి ఎలా జీవించకూడదో చేసి చూపించారు. రక్త చరిత్ర అంటూ ఏపీ రాజకీయాలలో కెమెరా పెట్టిన వర్మ ఇక ఏపీ రాజకీయ ఊబిలోనే చిక్కుకుపోయారు.
వైసీపీ కార్యకర్త మాదిరి జగన్ బానిసల తయారయ్యి 2014 నుంచి 2024 వరకు ఏపీలో వర్మ చేసిన రాజకీయ రచ్చసెన్సార్ హద్దులను కూడా చెరిపేసింది. 2014 లో కుదిరిన టీడీపీ జనసేన బంధానికి పరోక్షంగా బ్రేకులు వేశారు వర్మ. చిరు కుటుంబం మీద తానూ వ్యక్తిగతంగా పెంచుకున్న ద్వేషానికి నీలి రాజకీయాన్ని అడ్డుపెట్టుకున్నారు వర్మ.
Also Read – వినాయక మంటపాలతో కూడా రాజకీయాలా… యాక్!
జగన్ వ్యూహంలో భాగంగా శ్రీ రెడ్డిని అడ్డుపెట్టుకుని టీడీపీ అనుకూల మీడియాలో పవన్ పై వ్యక్తిగత దాడి చేపించి బాబు, పవన్ ల బంధానికి అడ్డుకట్ట వేశారు వర్మ. వర్మ ఆలోచనలను, శ్రీ రెడ్డి ఉద్దేశాలను, జగన్ రాజకీయ వ్యూహాలను పసిగట్ట లేని మీడియా వారిని ప్రోత్సహిస్తూ డిబేట్లు పెట్టడంతో టీడీపీ పై ద్వేషం పెంచుకున్నారు జనసైనికులు. దీని ఫలితమే 2019 వైసీపీ విజయం.
దీనితో అటు వైసీపీకి మేలు చేసిన వార్యయారు ఆర్జీవీ. అప్పటి వరకు వైసీపీకి తెర వెనుక సాయమందించిన ఆర్జీవీ ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ తో వెండి తెర మీద ప్రత్యక్షమై కమ్మరాజ్యంలో కడప రెడ్లు, వంగవీటి, వ్యూహం, శపధం అంటూ వైసీపీ కి అనుకూలంగా సినిమాలు తీసి టీడీపీ, జనసేనలను దెబ్బ కొట్టడానికి తన వృత్తికి ఉన్న విలువను సైతం దిగజార్చారు.
Also Read – చెప్పాల్సింది చెప్పేసి తూచ్ అంటే ఎలా బ్రహ్మాజీ?
ఒక సినీ దర్శకుడిగా గుర్తింపును, స్థాయిని ఇచ్చిన సమాజానికి వర్మ అస్లీలతను, అరాచకాన్ని బహుమతిగా అందించారు. ఒక చిల్లర వ్యక్తి మాదిరి సోషల్ మీడియాలో లోకేష్, పవన్, బాబు ల ఫోటోలను మార్పింగ్ చేసి వారి మద్దతుదారుల మనోభావాలను దెబ్బ తీసి పైశాచిక ఆనందాన్ని అనుభవించిన ఆర్జీవీ ఇప్పుడు కనుమరుగయ్యారు.
ఇన్నాళ్లుగా పులివెందుల ఎమ్మెల్యే తాలూకా వ్యక్తిగా సగర్వంగా తిరిగిన ఆర్జీవీ ఇప్పుడు కుప్పం ఎమ్మెల్యే గారి తాలూకా పదవికి భయపడ్డారా? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సైన్యాన్ని చూసి వెనకడుగు వేస్తున్నారా? లేక మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా రెడ్ బుక్ చూసి కంగారు పడుతున్నారా? అనే ప్రశ్నకు కనీసం సోషల్ మీడియాలో అయినా సమాధానం చెప్పాలి అని కూటమి పార్టీల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.