ప్రధాని నరేంద్ర మోదీ తో ప్రశంసలు అందుకున్న చిత్రంగా “ది కాశ్మీర్ ఫైల్స్” దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ మూవీగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. వసూళ్ళలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది.
తాజాగా ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పవన్ కళ్యాణ్ ను కలిశారు. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం ఏంతో సంతోషంగా ఉందంటూ, ఆ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా పవన్, హరీష్ శంకర్ తో ఉన్న పిక్ ని షేర్ చేస్తూ తెలిపారు. అయితే అభిషేక్ పవన్ ను కలవడానికి గల కారణాన్ని మాత్రం తెలపలేదు.
పవన్ తో ఒక సినిమాను నిర్మించడం కోసమే అభిషేక్ చర్చలు జరిపినట్టు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.వీరిద్దరి కలయికకు సాక్ష్యంగా టాలీవూడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ నిలిచారు. ఇప్పటికే పవన్ తానూ అంకీకరించిన మూవీస్ పూర్తి చేయడానికే సతమతమవుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ టాక్.
ఈ తరుణంలో మరో కొత్త మూవీ ఆఫర్ అందుకునే సమయం పవన్ దగ్గర ఉందా.? అంటూ పవన్ అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇటు రాష్ట్రంలో రాజకీయాలు నానాటికి దిశలు మార్చుకుంటూ రోజుకో పంచాయితీతో ప్రతిపక్షాలకు తీరికలేకుండా ప్రభుత్వం పని చేస్తున్న పరిస్థితులలో పవన్ సినిమాలంటూ రాజకీయాలను దూరం పెడతారో అని జనసైనికులలో ఆందోళన మొదలయ్యింది.



