ktr-_jagan

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలిచ్చిన తీర్పు ప్రతిపక్ష పార్టీలకు జీవన్మరణ సమస్యను తెచ్చిపెట్టింది. వన్ సైడ్ విక్టరీతో అధికార పార్టీలకు పూర్తి హక్కులు ఇచ్చిన ఇరు రాష్ట్రాల ప్రజలు గత ప్రభుత్వ పెద్దలను చావుదెబ్బ కొట్టారు.

Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది

తెలంగాణలో కనీసం బిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అయిన దక్కింది కానీ ఏపీలో వైసీపీని ఆ స్థాయికి కూడా చేరుకోనివ్వలేదు. ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలిచ్చిన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ తనలో విలీనం చేసుకునే దిశలో పావులు కదుపుతుంది.

ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన నేతలందరూ దాదాపుగా గులాబీ కండువాకి సెండ్ ఆఫ్ చెప్పేసారు. అలాగే ఇటు ఏపీ విషయానికి వస్తే వైసీపీ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే లే 11 మంది. అందులో జగన్ ను మినహాయిస్తే పట్టుమని పదిమంది. ఈ ఐదేళ్లు ఈ పదిమందిని పెట్టుకుని జగన్ చేసే రాజకీయం ఏ మేరకు ఫలితాలనివ్వవనుందో రానున్న రోజులలో తేలనుంది.

Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?

గత ప్రభుత్వ అవినీతిని తవ్వితీసే పనిలో ఉన్నాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు. దీనితో ఏ సమయంలో ఎవరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందో అనే ఆందోళన అటు బిఆర్ఎస్, ఇటు వైసీపీ నేతలను వెంటాడుతుంది. అయితే ఏపీలో జనసేన, కాంగ్రెస్, తెలంగాణలో బీజేపీ ఈ రెండు పార్టీల స్థానాలను భర్తీ చేయడానికి అవకాశం కోసం కాచుకుని కుర్చిన్నాయి.

TS లో బిఆర్ఎస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని తమకు అవకాశంగా మలచుకోవడానికి, ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అక్కడి బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఏపీలో జగన్ మీద ఉన్న ద్వేషాన్ని వైసీపీ పతనంతో చల్లార్చుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది వైస్ షర్మిల. ఆలాగే ప్రభుత్వంలో భాగమైన జనసేన ఇప్పుడు ఏపీలో రెండవ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది.

Also Read – వింటేజ్ విరాట్…!

పోటీ చేసిన 21 కి 21 నెగ్గి తన స్థానాన్ని ఏపీలో పదిలం చేసుకుంది జనసేన. ఇప్పుడు వైసీపీ తిరిగి కోలుకోవాలంటే అటు జనసేనను కట్టడి చెయ్యాలి ఇటు కాంగ్రెస్ తోనూ పోటీ పడాలి. కాంగ్రెస్ నుండి జగన్ సొంతం చేసుకున్న ఓటు బ్యాంకును తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడానికి వైస్ షర్మిల ఎదురుచూస్తుంది. రానున్న కాలంలో జనసేనను మరింత బలపరిచి తన పరిధిని పెంచుకోబడానికి ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు పవన్.

మొదటి స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇటు మూడో ప్రత్యమ్నాయం అయిన బీజేపీ రెండో స్థానంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని పాతాళానికి తెచ్చి కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును సమాధి చెయ్యాలని చూస్తుంటే, ఇక్కడ టీడీపీ కొట్టే దెబ్బ నుండి తప్పించుకుని, జనసేన ను ఎదిరించి కాంగ్రెస్ ఉచ్చులో వైసీపీ ఫ్యాన్ రెక్కలు చిక్కుకోకుండా జాగ్రత్త పడాల్సిన సందర్భంలో జగన్ రాజకీయ భవిష్యత్తు నిలబడింది.




ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో జగన్, కేటీఆర్…తమ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి అటు అధికార పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ లతో పాటుగా ఇటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు అడ్డుగోడల మాదిరి నిలబడ్డారు. వీరందరిని దాటుకుని ప్రస్తుతానికి జీరో గా ఉన్న వైసీపీ, బిఆర్ఎస్ లను హీరోలుగా నిలబెట్టాల్సిన ఈ నేస్తలిద్దరిది (జగన్, కేటీఆర్) ఒకటే లోకం.