These are the favorite dishes of Telugu star heroesవయసు పెరిగిపోతున్నా మన స్టార్ హీరోలు మాత్రం ఎప్పుడూ ఒకే రకమైన ఫిట్ నెస్ తో కనిపిస్తున్నారు. మరి ఆ ఫిట్ నెస్ కి ప్రధాన కారణం ఏమిటో తెలుసా ? వాళ్ళు తీసుకునే ఆహారం అట. మరి తినే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే హీరోలలో.. ఏ హీరో ఏ వంటలను ఇష్టంగా తింటారో చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి :

మెగాస్టార్ చిరంజీవికి చిన్నతనం నుంచి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టం. అలాగే చిరంజీవి దోశలను కూడా ఇష్టంగా తింటారు. ‘చిరంజీవి దోశ’ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

బాలయ్య బాబు :

బాలయ్య బాబు విషయానికి వస్తే.. ఆయన రొయ్యలను బాగా ఇష్టపడతారు. చికెన్ బిర్యానీ కూడా బాలయ్యకి ఫేవరెట్. అయితే, ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతం ఫుడ్ ని ఆస్వాదించడం బాలయ్యకి ఉన్న అలవాటు.

విక్టరీ వెంకటేష్ :

వెంకటేష్ నోస్టాల్జిక్ కీమాను ఎక్కువ ఇష్టపడతారు. అలాగే వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకుని నోస్టాల్జిక్ కీమాను తినడం వెంకటేష్ బాగా లైక్ చేస్తారట.

కింగ్ నాగార్జున :

ఆరు పదుల వయసులో కూడా నాగార్జున పెర్ఫెక్ట్ ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తున్నాడు. నాగార్జున దోశ, చేపలు, గ్రిల్డ్ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు.

రెబల్ స్టార్ ప్రభాస్ :

ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ ఏమిటో తెలుసా ? బిర్యానీ అట. అలాగే, సీ ఫుడ్ తో పాటు రోడ్ సైడ్ పానీపూరీని కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు :

మహేష్ వాళ్ళ అమ్మమ్మ గారు చేసే ప్రతి వంటను ఎంతో ఇష్టంగా తినేవారు. అయితే, ప్రస్తుతం మహేష్ ఇష్టమైన వంటకాలను కూడా డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ :

పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టమైన వంటకం నెల్లూరు చేపల పులుసు. అలాగే, పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసును కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారు.

జూనియర్ ఎన్టీఆర్ :

జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్ తో గ్రేట్ చెఫ్ కూడా. ఇక ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్.. రోటీ, నాటుకోడి ఖీమా. అలాగే ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ :

చరణ్ కూడా బిర్యానీనే ఇష్టపడతారు. అలాగే చిరంజీవి దోశని కూడా చరణ్ ఇష్టంగా తింటాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ :

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ కి వాళ్ళ అమ్మగారు చేసే వంటలే ఫేవరేట్. అయితే, బన్నీ బిర్యానీని ఇష్టంగా తింటాడు.