This Formula does not apply for chandrababu

గణితంలో అనేక ఫార్ములాలు ఉన్నట్లే రాజకీయాలలో కూడా కొన్ని ఫార్ములాలు ఉంటాయి. రాజకీయాలలో ఉన్నవారికి ఈ రాజకీయ ఫార్ములాలు ‘పని’ తేలిక చేసి పెడుతుంటాయి.

ఉదాహరణకు అవినీతి కేసులలో బుక్ అయితే ‘రాజకీయ కక్ష సాధింపు’ అని వాదించవచ్చు లేదా ‘కులం కార్డ్’ ప్రయోగించి సానుభూతి పొందేందుకు ట్రై చేయవచ్చు. అదే.. పోలీస్ స్టేషన్‌, సీబీఐ, ఈడీ విచారణకు హాజరవ్వాల్సివస్తే ఒంటరిగా వెళ్ళకుండా ఎన్నికల నామినేషన్ వేసేందుకు బయలుదేరిన్నట్లు ఓ నాలుగైదు వందల మందిని వెంటేసుకొని వెళితే ప్రజల అభిప్రాయం మార్చవచ్చు. ఇలా చాలా ఫార్ములాలే ఉన్నాయి. వాటిని మన రాజకీయ నాయకులు విరివిగా వాడేసుకుంటున్నారు కూడా.

Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..

అయితే గణితంలో ఒక ఫార్ములా మరో లెక్కకు పనికిరాన్నట్లే రాజకీయాలలో కూడా ఓ ఫార్ములా మరో రకం రాజకీయానికి పనికిరాదు. ఈవిషయం తెలియకనే సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వైసీపీ తప్పుడు ఫార్ములాతో ప్రయత్నించి నవ్వులపాలవుతోంది.

గతంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు అవసరం లేదు సంక్షేమ పధకాలు చాలనుకున్నారు. చంద్రబాబు నాయుడుపై కక్ష, ద్వేషంతో ఆయన తెచ్చిన వాటిని, టీడీపీతో సంబంధం ఉన్నవారి పరిశ్రమలని వేధించి రాష్ట్రం నుంచి తరిమేశారు. లేదా మూతబడేలా చేశారు. ఈ భయంతో కొత్తవి రాలేదు. ఈ జగన్‌ భయంతోనే నేటికీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి భయపడుతూనే ఉన్నారు.

Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడుతుండేది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో టీడీపీ, వైసీపీల మద్య సోషల్ మీడియాలో కూడా భీకర యుద్ధాలు జరుగుతుండేవి.

ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి రాగానే అదే ఫార్ములాతో చంద్రబాబు నాయుడుపై యుద్ధం ప్రకటించి విమర్శించడం మొదలుపెట్టింది. ఆ ఉత్సాహంలో ఈ ఫార్ములా జగన్‌కి మాత్రమే వర్తిస్తుంది తప్ప చంద్రబాబు నాయుడుకి వర్తించదనే చిన్న విషయం మరిచిపోవడంతో జగన్‌కి, వైసీపీకి ఇంకా ఏమైనా పరువు మిగిలి ఉంటే దానిని వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా తీసిపడేస్తోంది.

Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?

చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులవలననే యూనిలివర్, జిందాల్ స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయని చెపుతూ చంద్రబాబు నాయుడుని వికృతంగా ఫోటో పెట్టి ఆయన రాక్షసుడు, పిశాచి అంటూ వర్ణించింది. చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులకు భయపడే అవన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని వైసీపీ సోషల్ మీడియా తేల్చి చెప్పేసింది.

అంటే జగన్‌కు వర్తింపజేయాల్సిన ఫార్ములాని యధాతధంగా చంద్రబాబు నాయుడుకి వర్తింపజేసేసి, ఆనాడు టీడీపీ వాదనలనే కాపీ కొట్టిందన్న మాట! కనుక దీనిలో ‘కాపీ రైట్’ నేరం కూడా ఉంది.

పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనపడిన్నట్లు జగన్‌కి ద్వేషం, కక్ష సాధింపులు అలవాటు ఉంటే అందరికీ ఉంటాయనుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులకు పాల్పడేవారే అయితే ఈపాటికి జగన్‌తో సహా వైసీపీ ముఖ్య నేతలందరూ జైల్లో ఉండేవారు కదా? కానీ ఆయనకు అటువంటి ఆలోచన లేదు కనుకనే నేడు సోషల్ మీడియాలో ఇలాంటి రాతలు వ్రాయగలుగుతున్నారు కదా?




కేవలం ఏడు నెలలలోనే రాష్ట్రానికి సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తీసుకువచ్చారు కదా? ఒకవేళ రేపు యూనిలివర్, జేఎస్‌డబ్ల్యూ తదితర కంపెనీల ప్రతినిధులు అమరావతికి వచ్చి ఒప్పందాలు చేసుకుంటే వైసీపీ తల ఎక్కడ పెట్టుకుంటుంది?