
బటన్ నొక్కా… మేలు చేశానంటూ నేటికీ జగన్ పాట పాడుతూనే ఉన్నారు. ఒకవేళ నేడు తానే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికి అమ్మఒడి డబ్బులు చేతికి వచ్చేవి.. అంటూ తాను తయారుచేసుకున్న పాత సంక్షేమ క్యాలండర్ తిరగేసి చెప్పుకుంటున్నారు.
కానీ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పాలించినా కర్నూలు న్యాయరాజధాని, విశాఖ రాజధాని ఎందుకు ఏర్పాటు చేయలేదో ఎన్నడూ మాట్లాడరు!
Also Read – విశ్వసనీయత అంటే సంక్షేమ పధకాలు అమలుచేయడమేనా?
తన 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రంలో ఏయే జిల్లాలలో ఎక్కడెక్కడ కొత్తగా ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయో చెప్పలేరు!
పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేకపోయినా తమ హయంలో లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాది పొందారని నేటికీ నిసిగ్గుగా చెప్పుకుంటూనే ఉన్నారు!
Also Read – ఏనాటి ద్వేషమిది.? కార్యకర్తల పాటి విలువ లేదా.?
కానీ రాష్ట్రాభివృద్ధి అంటే బటన్ నొక్కడం, అప్పులు చేసి జనానికి డబ్బు పంచిపెట్టడం కాదని, సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడిన రోడ్ల మరమత్తు పనులు జోరుగా సాగుతున్నాయి. అవసరమైన చోట్ల కొత్త రోడ్లు నిర్మిస్తున్నారు.
Also Read – మనోభావాలను….మానసిక క్షోభను ‘గాలి’కొదిలేసినట్టేనా.?
రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కాగితాల మీద కాకుండా భూమ్మీదే జరుగుతున్నాయి.
తాజాగా సత్యసాయి జిల్లా, గుడిపల్లిలో ఆజాద్ ఇండియా మొబిలిటీ అనే సంస్థ రూ. 1046 కోట్ల పెట్టుబడితో వాహనాల తయారీ పరిశ్రమని ఏర్పాటు చేయబోతోంది. దీని కోసం ఇప్పటికే అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం, కియా కంపెనీకి సమీపంలోనే దీని ఏర్పాటుకి 70.71 ఎకరాలు కేటాయించడం జరిగింది.
ఈ పరిశ్రమలో విద్యుత్‌తో నడిచే ఆటోలు, బస్సులు, లారీలు తయారు చేస్తారు. దీనిని మూడు దశలలో నిర్మించి ఉత్పత్తి ప్రారంభించాలని ఆ సంస్థ ప్లాన్ చేసుకుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ, ఏప్రిల్ 2028 నాటికి రెండో దశ, ఏప్రిల్ 2030 నాటికి మూడో దశ పూర్తి చేయాలని నిర్ణయించింది.
కనుక అదే క్రమంలో మూడు దశలలో 36, 26, 8.71 ఎకరాల చొప్పున భూమిని కేటాయించాలని ఏపీఐసీసీ నిర్ణయించింది.
ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 2,231 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరో వెయ్యి మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమతో ఇంతమందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తే వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
చుట్టు పక్కల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. పరిశ్రమలు, వాటి ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపేణా భారీగా ఆదాయం లభిస్తుంది. సంపద సృష్టి.. అభివృధ్ది అంటే ఇదే కదా జగన్ మావయ్యా?