
జగన్ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు నాయుడుని, ఆయన కుటుంబాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆయనని వారించాల్సిన జగన్ ముసిముసినవ్వులు నవ్వారు.
జగన్ మెప్పు, నమ్మకం పొందాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లని అవహేళన చేసి నిరూపించుకోవాల్సి ఉండేదని ఆ పార్టీని వీడివచ్చిన నేతలు చెపుతుంటారు.
Also Read – అప్పుడు డ్రగ్స్ కేసులు…ఇప్పుడు బెట్టింగ్ కేసులు..!
కనుక వైసీపీలో పోసాని వంటివారు చెలరేగిపోయారు. వారి వీడియోలన్నీ సోషల్ మీడియాలో నేటికీ భద్రంగానే ఉన్నాయి.
“వీడియో సాక్ష్యాధారాలున్నప్పుడు ఆయనని అరెస్ట్ చేయడం తప్పేలా అవుతుందని” ఓ విలేఖరి పోసాని తరపున వాదించడానికి వచ్చిన ఆస్థాన న్యాయవాది సుధాకర్ రెడ్డిని ప్రశ్నించగా “ఇప్పుడు తప్పా ఒప్పా అనేది ముఖ్యం కాదు. తప్పా ఒప్పా అని న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఈ వ్యవహారాన్ని చట్టపరిధిలో చూడాలి. కనుక ఓ న్యాయవాదిగా ఓ ముద్దాయి (పోసాని)ని ఏ పరిస్థితిలో జైలులో పెట్టవచ్చు.. ఏ పరిస్థితిలో పెట్టకూడదు.. ఇది చట్ట సమ్మతమేనా కాదా?అని పరిశీలించి తదనుగుణంగా న్యాయపోరాటం చేయడమే నా బాధ్యత,” అని అన్నారు.
Also Read – పాదయాత్రలా.. జైలా… ఏది బెస్ట్?
అంటే చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ ఉద్దేశయించి ఆనాడు పోసాని అంత అనుచితంగా మాట్లాడటం తప్పని తెలిసి ఉన్నప్పటికీ ఆయనని కాపాడేందుకు చట్టంలో లొసుగులను ఏవిదంగా ఉపయోగించుకోవాలనేదే ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పిన్నట్లు స్పష్టమవుతోంది.
“కూటమి ప్రభుత్వం పాలనలో పీడనకు గురవుతున్న అభాగ్యులను ఆదుకోవాలని, వారికి న్యాయం చేసేందుకు పోరాడాలని జగన్ సూచన మేరకే నేను పోసాని కోసం వచ్చానని” సుధాకర్ రెడ్డి చెప్పుకున్నారు.
Also Read – నాడు అమరావతి విలవిలా.. నేడు కళకళా!
చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ తిట్టిపోసిన పోసానికి న్యాయం చేయడం కోసం పోరాడుతున్నానని అంత సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?
వివేకా గొడ్డలిపోటుకి సాక్ష్యాధారాలు లేవేమో కానీ ఈవీఎం ధ్వంసం కేసు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, సత్యవర్ధం కిడ్నాప్ కేసు, ఇప్పుడు పోసాని కేసులో పూర్తి సాక్ష్యాధారాలు న్నాయి. కానీ వారిని జగన్ వెనకేసుకు వస్తున్నారు. జైలుకి వెళ్ళి అరెస్ట్ అయిన పరామర్శించి వస్తున్నారు. తన ఆస్థాన న్యాయవాది ద్వారా బెయిల్ సంపాదించిపెడుతున్నారు.
తద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నామని జగన్‌కు తెలియదనుకోలేము. కానీ తన మెప్పుకోసం చెలరేగిపోయిన వైసీపీ నేతలని కాపాడుకోకపోతే, పార్టీలో అందరికీ తనపై నమ్మకం పోటుంది. పార్టీ చెల్లాచెదురు అయిపోతుందనే భయంతోనే తప్పని తెలిసినా జగన్ వారిని వెనకేసుకువస్తున్నారని భావించవచ్చు. దీనినే ఆయన న్యాయపోరాటం అని ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు కూడా.
వంశీని పరామర్శించి రాగానే ఇప్పుడు పోసాని లోనికి వెళుతున్నారు. కనుక జగన్‌కి మళ్ళీ పనిపడిన్నట్లే.